Covovax | కొవొవాక్స్ టీకాను ఆమోదించని నిపుణుల కమిటీ!
Covovax Vaccine | పుణెకు చెందిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కంపెనీ తయారు

న్యూఢిల్లీ : పుణెకు చెందిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కంపెనీ తయారు చేస్తున్న కొవొవాక్స్ (Covovax) టీకాకు ఆమోదం తెలుపలేదని అధికార వర్గాలు ఆదివారం తెలిపాయి. ఇటీవల వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతి కోరుతూ సీరం సంస్థ అక్టోబర్‌లో డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాకు దరఖాస్తు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఇటీవల దరఖాస్తును పరిశీలించిన నిపుణుల కమిటీ.. అదనపు డేటా ఇవ్వాలని సీరం సంస్థకు సూచించింది.
సీరం సంస్థ ప్రస్తుతం దేశంలో నిర్వహించిన ఫేజ్-2, ఫేజ్-3 క్లినికల్ ట్రయల్స్‌కు సంబంధించిన తాత్కాలిక భద్రత, ఇమ్యునోజెనిసిటీ డేటాను, అలాగే అమెరికా, యూకేలో నిర్వహించిన ఫేజ్-3 క్లినికల్ ట్రయల్స్‌కు సంబంధించి భద్రత, సమర్థత డేటాను డీసీజీఐకి అందించింది. ఈ మేరకు ఈ నెల 24న దరఖాస్తుపై చర్చించిన సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) కొవిడ్-19 సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కమిటీ (SEC) వ్యాక్సిన్.. నోవావాక్స్ వ్యాక్సిన్ సాంకేతిక బదిలీ అని, దేశంలో ఇంకా ఆమోదించలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి.
వివరణాత్మక చర్చల అనంతరం సంస్థ అదనపు డేటా, సమాచారాన్ని సమర్పించాలని కమిటీ సిఫారసు చేసింది. అమెరికా, యూకేలో ఫేజ్-3 క్లినికల్ ట్రయల్‌కు సంబంధించి మరింత సమాచారాన్ని ఇవ్వాలని కోరింది. ఇదిలా ఉండగా.. దేశంలో వ్యాక్సిన్ ఇంకా ఆమోదించనందున సీరం సంస్థ రెండు కోట్ల డోసుల కొవొవాక్స్ టీకాలను ఇండోనేషియాకు ఎగుమతి చేసేందుకు ప్రభుత్వం ఇటీవల అనుమతి ఇచ్చినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది మే 17న కొవొవాక్స్ టీకా తయారీ, నిల్వ చేసేందుకు సీరం కంపెనీకి డీసీజీఐ అనుమతి ఇచ్చింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

