ఆగస్టు నుంచి పిల్లలకు కోవిడ్ టీకాలు: కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి

న్యూఢిల్లీ: ఆగస్టు కల్లా చిన్నపిల్లలకు కోవిడ్ టీకాలు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సూక్ మాండవీయ వెల్లడించారు. ఇవాళ బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆయన ఈ విషయాన్ని తమ పార్టీ ఎంపీలకు చెప్పినట్లు తెలుస్తోంది. మరోవైపు ఇవాళ రాజ్యసభలోనూ పిల్లల వ్యాక్సినేషన్ గురించి ఓ సభ్యుడు ప్రశ్నించారు. ఆ సమయంలో మంత్రి సమాధానం ఇవ్వబోయారు. కానీ విపక్ష సభ్యుల నినాదాల మధ్య ఆరోగ్య మంత్రి ఇచ్చిన సమాధానం సరిగా వినపడలేదు.
ప్రస్తుతం ఇండియాలో రెండు కోవిడ్ టీకాలను పిల్లలపై ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. జైడస్ క్యాడిలా ఇచ్చిన రిపోర్ట్‌ను డ్రగ్ రెగ్యులేటర్ పరిశీలిస్తున్నది. 12 నుంచి 18 ఏళ్ల మధ్య పిల్లలపై జైడస్ కోవిడ్ టీకా ట్రయల్స్ నిర్వహించింది. ఇక భారత్ బయోటెక్ సంస్థ కూడా 2 నుంచి 18 ఏళ్ల మధ్య ఉన్న పిల్లలపై రెండవ, మూడవ దశ ట్రయల్స్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ రెండు టీకాల ఫలితాల ఆధారంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ఉంటుందని ఇటీవల లోక్‌సభలో కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి భారతి పవార్ తెలిపారు.
దేశవ్యాప్తంగా స్కూళ్ల రీఓపెనింగ్ చేపట్టనున్న నేపథ్యంలో .. పిల్లలకు కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వడం కీలకమైందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

