మార్కెట్లోకి మరింత ఆలస్యంగా స్పుత్నిక్ వీ టీకా..

న్యూఢిల్లీ : స్పుత్నిక్ వీ కోవిడ్ టీకాలను మార్కెట్లోకి రిలీజ్ చేసేందుకు మరింత సమయం పట్టనున్నది. ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ ప్రతినిధి ఒకరు ఈ విషయం తెలిపారు. టీకాల దిగుమతి, క్వాలిటీ టెస్టింగ్ ఆలస్యం కావడం వల్ల.. స్పుత్నిక్ వీ టీకాలను మార్కెట్లోకి రిలీజ్ చేయడానికి మరింత సమయం పట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పైలట్ దశలో ఆ టీకాలను కొన్ని నగరాల్లో అందిన్తున్నారు. 28 నగరాల్లో స్పుత్నిక్ వీ టీకాలను అందుబాటులోకి తెచ్చేందుకు డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ ప్రయత్నిస్తున్నది. అయితే మరిన్ని నగరాలకు విస్తరించే అవకాశాలపై క్లారిటీ లేదని అపోలో హాస్పిటల్ వర్గాలు వెల్లడించాయి.
రెండు డోసుల స్పుత్నిక్ టీకాలు వేరువేరుగా ఉంటాయి. ఆడినోవైరస్ ద్వారా ఆ టీకాలను తయారు చేశారు. కానీ రెండు డోసుల్లో తేడా ఉంటుంది. 21 రోజుల వ్యవధిలో ఆ టీకాలను ఇవ్వాలి. బహుశా రెండు వేరువేరు డోసులు రాని కారణంగా.. స్పుత్నిక్ వీ పంపిణీ ఆలస్యం అవుతున్నట్లు భావిస్తున్నారు. రష్యాకు చెందిన స్పుత్నిక్ వీ టీకాలను ఇండియాలో రెడ్డీస్ ల్యాబ్ సరఫరా చేస్తున్న విషయం తెలిసిందే.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆరు నెలల్లోనే రేవంత్ మార్ ఆర్థిక వినాశనం
శభాష్ వంశిక.. జాతీయస్థాయి క్రికెట్‌కు ఎంపికైన విద్యార్థినిని అభినందించిన కేటీఆర్
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

