Covaxin | కొవాగ్జిన్ టీకాతో పిల్లల్లో 1.7 రెట్లు ఎక్కువగా యాంటీబాడీలు.. ట్రయల్స్ ఫలితాలు ప్రకటించిన భారత్ బయోటెక్
Covaxin found to be safe to 2-18 age group: Bharat Biotech | పిల్లలకు సంబంధించిన కొవిడ్ టీకా కొవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్ ఫలితాలను భారత్ బయోటెక్ ప్రకటించింది. గురువారం ఫేజ్-2, ఫేజ్-3 క్లినికల్

న్యూఢిల్లీ : పిల్లలకు సంబంధించిన కొవిడ్ టీకా కొవాగ్జిన్ (Covaxin Vaccine) క్లినికల్ ట్రయల్స్ ఫలితాలను భారత్ బయోటెక్ (Bharat Bio Tech) గురువారం ప్రకటించింది. ఫేజ్-2, ఫేజ్-3 క్లినికల్ ట్రయల్స్ ఫలితాల్లో కొవాగ్జిన్ టీకా 2 -18 సంవత్సరాల వయసు పిల్లలపై ఉత్తమ ఫలితాలు చూపిందని పేర్కొంది. పిల్లలకు సైతం టీకా సురక్షితమేనని, పిల్లల్లో 1.7 రెట్లు ఎక్కువగా యాంటీబాడీలు ఉత్పత్తయ్యాయని తెలిపింది. క్లినికల్ ట్రయల్స్‌లో పాల్గొన్న పిల్లల్లో ఎలాంటి దుష్పరిణామాలు చూపల్లేదని తెలిపింది. కేవలం తేలికపాటి లక్షణాలు మాత్రమే కనిపించాయని కంపెనీ తెలిపింది.
ఈ సందర్భంగా భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణ ఎల్లా మాట్లాడుతూ పిల్లలకు సంబంధించిన కొవాగ్జిన్ (Covaxin Vaccine) క్లినికల్ ట్రయల్స్ డేటా చాలా ప్రోత్సాహకరంగా ఉందన్నారు. పిల్లల టీకా సురక్షితమైందని భద్రత, ఇమ్యునోజెనిసిటీకి సంబంధించిన డేటా నిరూపించిందని తెలిపేందుకు సంతోషిస్తున్నామన్నారు. పెద్దలకు, పిల్లలకు సురక్షితమైన, సమర్థవంతమైన కొవిడ్ టీకాను అభివృద్ధి చేయాలన్న లక్ష్యాన్ని ప్రస్తుతం సాధించామన్నారు.
ఈ ఏడాది జూన్-సెప్టెంబర్ మధ్య దేశవ్యాప్తంగా పలు కేంద్రాల్లో 2-18 సంవత్సరాల వయసు గల పిల్లలను మూడు కేటగిరీలుగా విభజించి భారత్ బయోటెక్ (Bharat Bio Tech) కొవాగ్జిన్ (Covaxin Vaccine) టీకా ట్రయల్స్ నిర్వహించింది. టీకా సురక్షితమైందని, ఇమ్యునోజెనిసిటీ డేటా చూపగా.. ఆ డేటాను అక్టోబర్‌లో సెంట్రల్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO)కి కంపెనీ సమర్పించింది. ఇటీవల కొవాగ్జిన్ టీకాను పిల్లలకు వేసేందుకు నిపుణుల కమిటీ సిఫారసు చేసింది. ఈ నెల 25న 12-18 సంవత్సరాల మధ్య పిల్లలకు టీకా వేసేందుకు డీసీజీఐ అత్యవసర వినియోగ అనుమతి జారీ జారీ చేసిన విషయం తెలిసిందే.
దేశంలో ఒమిక్రాన్ ముప్పు నేపథ్యంలో అదే రోజు ప్రధాని నరేంద్ర మోదీ జనవరి 3 పిల్లలకు పిల్లలకు జనవరి 3 నుంచి టీకాలు వేయనున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా పిల్లలకు టీకాలు వేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణలో 15-18 సంవత్సరాల పిల్లలకు కొవాగ్జిన్ టీకా వేయనున్నట్లు ఇప్పటికే ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. అలాగే అహ్మదాబాద్‌కు చెందిన జైడస్ క్యాడిలా రూపొందించిన జైకోవ్-డీ టీకాకు సైతం ఆగస్ట్‌లో డీసీజీఐ అత్యవసర వినియోగ అనుమతి ఇచ్చింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

