6-12 ఏళ్ల వారికి కోవాగ్జిన్… డీసీజీఐ కీలక అనుమతులు
కోవిడ్ ఫోర్త్ వేవ్ వస్తుందున్న ప్రచారం నేపథ్యంలో డీసీజీఐ కీలక నిర్ణయం తీసుకుంది. 6 నుంచి 12 ఏళ్ల లోపు వయస్సు పిల్లలకు అత్యవసర వినియోగం కింద కోవాగ్జిన్ కు అనుమతినిస్తూ నిర్ణయం ప్రకటించింది. కోవిడ్ నాలుగో వేవ్ ఉంటుందని తీవ్ర ప్రచారం నేపథ్యంలో డీసీజీఐ తీసుకున్న ఈ నిర్ణయానికి ప్రాధాన్యం ఏర్పడింది.
ఇక 2 ఏళ్ల నుంచి 12 ఏళ్ల లోపు పిల్లలకు వ్యాక్సిన్ ఇచ్చేందుకు అవసరమైన అదనపు డేటాను పంపాలని డీసీజీఐ కోవ్యాగ్జిన్ నిపుణుల కమిటీని కోరింది. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్ట్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నిపుణుల కమిటీ సూచనలను పరిగణనలోకి తీసుకొని, డీసీజీఐ ఈ నిర్ణయం తీసుకుంది.
12 ఏళ్ల నుంచి 18 ఏళ్ల లోపు పిల్లల కోసం కోవాగ్జిన్ అత్యవసర వినియోగానికి డీసీజీఐ గత డిసెంబర్ 24న అనుమతినిచ్చిన విషయం తెలిసిందే. దీంతో పాటు 15 ఏళ్ల నుంచి 18 ఏళ్ల లోపు పిల్లలకు వ్యాక్సినేషన్ డ్రైవ్ జనవరి 3 నుంచి ప్రారంభమైంది. ఇక… దీంతో పాటు 5 -12 ఏళ్ల వారికి బయోలాజికల్ ఈ సంస్థ తయారు చేసిన కార్బేవ్యాక్స్ టీకాను ఇచ్చేందుకు డీసీజీఐ అనుమతినిచ్చింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

