Places of Worship Act: ప్రార్థనా స్థలాల సర్వేలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
Places of Worship Act: 1991 నాటి ప్రార్థనా స్థలాల చట్టంపై ఇవాళ సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. ప్రార్థనా స్థలాల వద్ద సర్వేలు నిలిపివేయాలని, ఆ స్థలాలపై కొత్త కేసులను స్వీకరించరాదు అని దేశంలోని ట్రయల్ కోర్టులకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
న్యూఢిల్లీ: 1991 నాటి ప్రార్థనా స్థలాల చట్టం(Places of Worship Act)పై ఇవాళ సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. ప్రార్థనా స్థలాల వద్ద సర్వేలు నిలిపివేయాలని, ఆ స్థలాలపై కొత్త కేసులను స్వీకరించరాదు అని దేశంలోని ట్రయల్ కోర్టులకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రార్థనా స్థలాల చట్టానికి లింకున్న కేసులపై చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మానం వాదనలు జరిపింది.
మతపరమైన ప్రదేశాలకు చెందిన అంశాల్లో ఆదేశాలు ఇవ్వడం ఆపివేయాలని సుప్రీంకోర్టు తన తీర్పులో తెలిపింది. ప్రార్థనా స్థలాలపై ఉన్న పెండింగ్ కేసుల విషయంలో కూడా సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. కోర్టులు ఆ కేసుల్లో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు అని చెప్పింది. సుప్రీం ఇచ్చిన తాజా ఆదేశాలను హిందువుల తరపున వాదిస్తున్న అనేక మంది లాయర్లు వ్యతిరేకించారు. తమ వాదనలు వినకుండా ఆదేశాలు ఇవ్వొద్దు అని కోరారు.
ప్రార్థనా స్థలాల అంశంపై రిప్లై ఇవ్వాలని కేంద్రానికి నాలుగు వారాల సమయం ఇచ్చింది కోర్టు. ఇక ఇలాంటి కేసుల్లో పార్టీలుగా ఉన్నవారికి అదనంగా మరో నాలుగు వారాల సమయాన్ని కేటాయించింది. ప్రార్థనా స్థలాల చట్టంలోని 2,3, 4 సెక్షన్లను తొలగించాలని అశ్విని ఉపాధ్యాయ కోరారు. మధుర శ్రీకృష్ణ జన్మభూమి కేసు తమ వద్ద పెండింగ్‌లో ఉన్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

