Demonetization | దేశంలో 108 మంది ప్రాణాలను బలితీసుకున్న మోదీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం..!
Demonetization | బ్లాక్ మనీ బయటికి వస్తుందన్న పేరుతో మోదీ ప్రభుత్వం వెలగబెట్టిన ఈ అనాలోచిత డీ మానిటైజేషన్ ప్రక్రియవల్ల ప్రజలకు మంచి సంగతేమోగానీ, చెడే ఎక్కువ జరిగింది. బ్యాంకుల్లోంచి తమ డబ్బును తాము విత్డ్రా చేసుకునేందుకు జనం నానా అవస్థలు పడాల్సి వచ్చింది.
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం 2016 నవంబర్ 8న అప్పటి వరకు అమల్లో ఉన్న రూ.1000, రూ.500 నోట్లను హడావిడిగా రద్దు చేసింది. ఆ తర్వాత పాత రూ.500 నోటు స్థానంలో కొత్త రూ.500 నోటును తీసుకొచ్చింది. అదేవిధంగా కొత్తగా రూ.2000 నోటును ప్రవేశపెట్టింది. బ్లాక్ మనీ బయటికి వస్తుందన్న పేరుతో మోదీ ప్రభుత్వం వెలగబెట్టిన ఈ అనాలోచిత డీ మానిటైజేషన్ ప్రక్రియవల్ల ప్రజలకు మంచి సంగతేమోగానీ, చెడే ఎక్కువ జరిగింది. బ్యాంకుల్లోంచి తమ డబ్బును తాము విత్డ్రా చేసుకునేందుకు జనం నానా అవస్థలు పడాల్సి వచ్చింది. బ్యాంకులు, ఏటీఎంల ముందు గంటల తరబడి క్యూలైన్లలో నిలబడాల్సిన పరిస్థితి నెలకొంది. అవసరానికి డబ్బు చేతికిరాక మానసిక వేదనను అనుభవించాల్సిన దుస్థితి దాపురించింది. ఆఖరికి మానసిక కుంగుబాటుతో, క్యూ లైన్లలో అవస్థలతో ప్రాణాలు కూడా కోల్పోవాల్సి వచ్చింది. అలా దేశవ్యాప్తంగా ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 108 మంది ప్రాణాలు కోల్పోయారు. మోదీ ప్రభుత్వ డీ మానిటైజేషన్ నిర్ణయం వల్ల ఏ రాష్ట్రంలో ఎంత మంది ప్రాణాలు కోల్పోయారనే విషయంపై పూర్తి సమాచారం..
ఆంధ్రప్రదేశ్ (6 మరణాలు)
రత్న పిళ్లై (వయస్సు 70 సంవత్సరాలు): బ్యాంకు ముందు క్యూలో వేచి చూస్తూ మరణించారు.
విజయలక్ష్మి (వయస్సు 70 సంవత్సరాలు): ఆమె తన పాత నోట్లను మార్చుకోవడానికి బ్యాంకులోకి వెళ్లి ప్రాణాలు కోల్పోయారు.
లక్ష్మీనారాయణ (వయస్సు 75 సంవత్సరాలు): బ్యాంకు ముందు క్యూలో వేచి ఉండి మరణించారు.
కోమలి (వయస్సు 18 నెలలు): మందులు కొనడానికి తల్లిదండ్రుల దగ్గర కొత్త నోట్లు లేవు. పాత నోట్లను స్వీకరించేందుకు ప్రైవేట్ ఆస్పత్రి నిరాకరించింది. దాంతో చిన్నారి ప్రాణాలు విడిచింది.
SK షరీఫ్ (వయస్సు 46 సంవత్సరాలు): SBI బ్యాంక్ డిప్యూటీ మేనేజర్. పని చేస్తున్నప్పుడు కుప్పకూలారు. ప్రతిరోజూ 14 గంటలు పనిచేస్తూ ఒత్తిడితో మృతిచెందారు.
SK మౌలాలి (వయస్సు 75 సంవత్సరాలు): బ్యాంకు ముందు క్యూలో కుప్పకూలి, మరుసటి రోజు ఆస్పత్రిలో మరణించారు. అంతకుముందు 10 రోజుల నుంచి ఆయన క్యూలో నిలబడుతున్నారు.
బీహార్ (5 మరణాలు)
సురేంద్ర శర్మ: బ్యాంకు ముందు క్యూలో నిరీక్షిస్తూ మరణించారు.
రామ్ అవధ్ సాహ్ (వయస్సు 45 సంవత్సరాలు): తన కుమార్తె పెండ్లికి కట్నంగా అత్తగారు పాత నోట్లను అంగీకరించకపోవడంతో మానసిక వ్యాకులత చెంది గుండెపోటుతో ప్రాణాలు విడిచారు.
లాల్ ముని దేవి: బ్యాంకు క్యూలో వేచి చూస్తూ మరణించారు.
మంజు మణిహి (వయస్సు 23 సంవత్సరాలు): ఆస్పత్రిలో పాత రూ.500 నోట్లను తీసుకోకపోవడంతో సమయానికి డయాలసిస్ జరగక చనిపోయారు.
హైదర్ అలీ: గుండెపోటుతో మరణించారు. నోట్లను మార్చుకోవడానికి బ్యాంకుల చుట్టూ తిరగడమే ఆయన మరణానికి కారణం.
చండీగఢ్ (ఒక మరణం)
బిషన్ కౌర్ (వయస్సు 65 సంవత్సరాలు): బ్యాంకు క్యూలో నిలబడి మరణించారు.
ఛత్తీస్గఢ్ (ఒక మరణం)
రైతు (వయస్సు 45 సంవత్సరాలు): తమిళనాడులో చిక్కుకుపోయిన తన పిల్లలకు డబ్బు పంపాల్సి వచ్చింది. అయితే మూడు రోజులు ప్రయత్నించినా పాత నోట్లను మార్చుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు.
ఢిల్లీ (4 మరణాలు)
వీరేంద్ర బసోయా: రూ.12 లక్షల విలువచేసే పాత కరెన్సీని మార్చుకోలేక ఉరేసుకుని ఆత్మహత్య.
సౌద్ ఉర్ రెహ్మాన్ (వయస్సు 48 సంవత్సరాలు): బ్యాంకు క్యూలో నిరీక్షిస్తూ మరణించారు.
రిజ్వానా (వయస్సు 24 సంవత్సరాలు): మూడు రోజులుగా పాత నోట్లను మార్చుకోలేక ఆందోళనతో ఉరేసుకుని ఆత్మహత్య.
సతీష్ (వయస్సు 49 సంవత్సరాలు): బ్యాంకు క్యూలో నిరీక్షిస్తూ మరణించారు.
గుజరాత్ (5 మరణాలు)
50 ఏళ్ల మహిళ: తన కుటుంబానికి ఆహారం కొనలేక ఆత్మహత్య చేసుకుంది.
69 ఏళ్ల వ్యక్తి: బ్యాంకు క్యూలో నిరీక్షిస్తూ మరణించారు.
బర్కత్ షేక్: బ్యాంక్ క్యూలో నిరీక్షిస్తూ మరణించారు.
తెలియని వ్యక్తి: బ్యాంకు క్యూలో నిలబడి మరణించారు.
ప్రేమ్ శంకర్ ప్రజాపతి (వయస్సు 33 సంవత్సరాలు): బ్యాంక్ క్యాషియర్. ఒత్తిడి కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడు.
హర్యానా (3 మరణాలు)
రాజేష్ కుమార్ (వయస్సు 56 సంవత్సరాలు): తన సహకార బ్యాంకులో మూడు పగళ్లు, రాత్రులు పనిచేసి విశ్రాంతిలేక మరణించారు.
గుర్తు తెలియని మహిళ: బ్యాంకు క్యూలో నిలబడి ఊపిరాడక మరణించారు.
కౌసల్యా దేవి (వయస్సు 80 సంవత్సరాలు): క్యూలో నిల్చుని అస్వస్థతకు గురయ్యారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
జమ్ము & కశ్మీర్ (ఒక మరణం)
మునీర్ (వయస్సు 8 సంవత్సరాలు): క్యాబ్ డ్రైవర్ పాత కరెన్సీని నిరాకరించడంతో అతనిని ఆస్పత్రికి తీసుకెళ్లడం తండ్రికి ఆలస్యమైంది. దాంతో ప్రాణాలు కోల్పోయాడు.
జార్ఖండ్ (4 మరణాలు)
లవకుష్: ఆర్థిక ఒత్తిడితో మరణించాడు. రోజు కూలీ అయిన అతని తండ్రి నోట్ల రద్దు కారణంగా ఉద్యోగం కోల్పోయాడు.
లక్ష్మి, లవకుష్ అమ్మమ్మ: మనవడి మరణవార్త విని షాక్తో మరణించారు.
రామ్ చంద్ర పాశ్వాన్: బ్యాంకు క్యూలో నిరీక్షిస్తూ మరణించారు.
బిందు కుమారి: కాలేజీ విద్యార్థిని. కాలేజీ ఫీజు కట్టలేక ఆత్మహత్య చేసుకుంది.
కర్ణాటక (2 మరణాలు)
గోపాల శెట్టి (వయస్సు 96 సంవత్సరాలు): బ్యాంకు క్యూలో నిరీక్షిస్తూ మరణించారు.
మహిళ (వయస్సు 40 సంవత్సరాలు): బ్యాంకులో మార్పించేందుకు తీసుకెళ్లిన రూ. 15 వేలను దొంగలు కొట్టేయడంతో ఆత్మహత్య చేసుకున్నారు.
కేరళ (4 మరణాలు)
కార్తికేయన్ (వయస్సు 75 సంవత్సరాలు): బ్యాంకు క్యూలో నిరీక్షిస్తూ చనిపోయారు.
KK ఉన్ని (వయస్సు 45 సంవత్సరాలు): బ్యాంకు మూడో అంతస్తు నుంచి జారిపడి మరణించారు.
ఓమనకుట్టన్ పిళ్లై (వయస్సు 73 సంవత్సరాలు): బ్యాంకులో దాచుకున్న తన డబ్బును ఉపసంహరించుకోలేననే భయంతో ఆత్మహత్య.
చంద్రశేఖరన్ (వయస్సు 68 సంవత్సరాలు): బ్యాంకు క్యూలో నిరీక్షిస్తూ మరణించారు.
మధ్యప్రదేశ్ (7 మరణాలు)
బాబూలాల్ వాల్మీకి: రూ. 12 వేలు మార్పించేందుకు బ్యాంకుకు వెళ్లి 100 మీటర్ల దూరంలో కుప్పకూలి మరణం.
సంజయ్ ప్రజాపత్: బ్యాంకులో పాత నోట్లను మార్చుకునేందుకు తన తండ్రి ఆధార్ కార్డు తీసుకురావడానికి ఇంటికి వెళ్లి మరణం.
వినయ్ కుమార్ పాండే: బ్యాంకు క్యూలో వేచిచూస్తూ మరణం.
గుర్తు తెలియని వ్యక్తి: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్యాషియర్. ఎక్కువ గంటలు పనిచేస్తూ గుండెపోటుతో మరణం.
హల్కే లోధీ: రబీ విత్తిన సీజన్లో ఎరువులు, విత్తనాలు కొనేందుకు డబ్బులు లేకపోవడంతో ఆత్మహత్య.
లక్ష్మణ్ మెహ్రా (వయస్సు 45 సంవత్సరాలు): బ్యాంకు నుంచి డబ్బు విత్డ్రా చేయడంలో విఫలమై ఆత్మహత్య.
కమల్ వన్ష్కర్ (వయస్సు 65 సంవత్సరాలు): నాలుగు గంటలకు పైగా బ్యాంకు క్యూలో నిలబడి మరణం.
మహారాష్ట్ర (7 మరణాలు)
తుకారాం తన్పురే (వయస్సు 53 సంవత్సరాలు): బ్యాంకు ప్యూన్. రోజుకు 12 గంటలు పనిచేసి గుండెపోటుతో మరణం.
దిగంబర్ కస్బే (వయస్సు 60 సంవత్సరాలు): బ్యాంకు క్యూలో వేచిచూస్తూ మరణం.
దీపక్ షా (వయస్సు 60 సంవత్సరాలు): బ్యాంకు క్యూలో వేచిచూస్తూ మరణించారు.
నవజాత శిశువు: తల్లిదండ్రుల వద్ద ఉన్న పాత కరెన్సీని ఆస్పత్రి సిబ్బంది నిరాకరించడంతో అనారోగ్యంతో ఉన్న నవజాత శిశువు మృతి.
విశ్వాస్ వర్తక్ (వయస్సు 72 సంవత్సరాలు): బ్యాంకు క్యూలో నిరీక్షిస్తూ మరణం.
RV రాజేష్ (వయస్సు 51 సంవత్సరాలు): బ్యాంకు ఉద్యోగి. గుండెపోటుతో మరణం.
ప్రభాకర్ నారాయణ్ రౌత్ (వయస్సు 72 సంవత్సరాలు): బ్యాంకు క్యూలో నిల్చుని కుప్పకూలాడు. ఆస్పత్రికి తరలించేలోగా చనిపోయారు.
మణిపూర్ (1 మరణం)
ఇబొహంబి అకోయిజమ్ (వయస్సు 70 సంవత్సరాలు): పింఛన్ కోసం పోస్టాఫీస్ క్యూలో నిలబడి మరణించారు.
ఒడిశా (ఒక మరణం)
చిన్నారి (వయస్సు 2 సంవత్సరాలు): ఆటో డ్రైవర్లు పాత రూ.500 నోట్లు తీసుకునేందుకు నిరాకరిచడంతో ఆస్పత్రికి తీసుకెళ్లడం ఆలస్యమై మరణించాడు.
పంజాబ్ (6 మరణాలు)
సుఖ్దేవ్ సింగ్: కూతురి పెళ్లి కోసం అతను పొదుపు చేసిన పాత నోట్లను ఎవరూ అంగీకరించకపోవడంతో గుండెపోటుతో మరణించారు.
బల్బీర్ సింగ్ (వయస్సు 52 సంవత్సరాలు): గుండె సంబంధ సమస్యలు ఉన్న ఈయన బ్యాంక్ క్యూలో వేచిచూస్తూ మరణించారు.
భగవాన్ సింగ్ (వయస్సు 70 సంవత్సరాలు): వ్యవసాయం, గృహావసరాలకు నగదు కోసం బ్యాంకు క్యూలో వేచిచూస్తూ చనిపోయారు.
లక్కీ (వయస్సు 19 సంవత్సరాలు): ఆత్మహత్య చేసుకుంది.
మలూక్ సింగ్ (వయస్సు 65 సంవత్సరాలు): బ్యాంకు క్యూలో నిలబడి మరణించారు.
ఆశా రాణి (వయస్సు 48 సంవత్సరాలు): బ్యాంకు క్యూలో స్పృహతప్పి పడిపోయింది. ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు ప్రకటించారు.
రాజస్థాన్ (5 మరణాలు)
నవజాత శిశువు: తల్లిదండ్రుల దగ్గర పాత నోట్లు ఉండటంతో శిశువును ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్ డ్రైవర్ నిరాకరించాడు. దాంతో ప్రాణాలు పోయాయి.
జగదీష్ పన్వార్ (వయస్సు 62 సంవత్సరాలు): తన కుమార్తె పెళ్లికి నగదు లేదన్న ఒత్తిడివల్ల గుండెపోటుతో మరణించారు.
రత్న రామ్ (వయస్సు 75 సంవత్సరాలు): డబ్బు విత్డ్రా చేసిన తర్వాత బ్యాంకు ముందు వాంతులు చేసుకుని కుప్పకూలాడు.
చిరంజీవి లాల్ (వయస్సు 70 ఏళ్లు): బ్యాంకు క్యూలో నిలబడి కుప్పకూలారు. ఆస్పత్రిలో మరణించారు.
మోడు సింగ్ గురియార్ (వయస్సు 46 సంవత్సరాలు): బ్యాంక్ క్యూలో నిలబడి మరణించారు.
తమిళనాడు (ఒక మరణం)
ఎం సుబ్రమణియన్ (వయస్సు 70 సంవత్సరాలు): బ్యాంకు క్యూలో నిలబడి చనిపోయారు.
తెలంగాణ (4 మరణాలు)
షేక్ బషీర్: ఒక ఫైనాన్షియర్ తన పాత కరెన్సీ నోట్లను స్వీకరించడానికి నిరాకరించడంతో ఆత్మహత్య చేసుకున్నారు.
బాలయ్య (వయస్సు 45 సంవత్సరాలు): తన భూమి ధర రూ.6-7 లక్షలకు ఎకరా నుంచి రూ.2-3 లక్షలకు ఎకరాకు తగ్గడంతో విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
గాలయ్య, బాలయ్య తండ్రి: అప్పటికే అప్పుల్లో ఉన్న గాలయ్య తన భూమి ధర రూ.6-7 లక్షలకు ఎకరా నుంచి రూ.2-3 లక్షలకు ఎకరాకు తగ్గడంతో విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
కందుకూరి వినోద (వయస్సు 55 సంవత్సరాలు): తాను దాచిపెట్టుకున్న రూ.54 లక్షలు విలువ లేకుండా పోవడంతో ఆత్మహత్య చేసుకున్నారు.
ఉత్తర ప్రదేశ్ (28 మరణాలు)
ఇష్తేయాక్ అహ్మద్ (వయస్సు 70 సంవత్సరాలు): బ్యాంక్ క్యూలో వేచిచూస్తూ మరణించారు.
మహమ్మద్ షాజాద్: వరుసగా నాలుగు రోజులు బ్యాంకు క్యూలో నిరీక్షిస్తూ చనిపోయారు.
సురేష్ సోనార్: కుమార్తె తిలకం వేడుకకు కరెన్సీ నోట్లు అవసరం రావడంతో నోట్లను మార్చుకునేందుకు బ్యాంకుకు వెళ్లి గుండెపోటుతో మరణించారు.
ఖాలిక్ హసన్ (వయస్సు 56 సంవత్సరాలు) – బ్యాంకు క్యూలో వేచిచూస్తూ మరణించారు.
సుమిత్ (వయస్సు 17 సంవత్సరాలు): తల్లి చెలామణిలో ఉన్న చిన్న నోట్లు ఇవ్వలేదని ఆత్మహత్య చేసుకున్నాడు.
అజీజ్ అన్సారీ (వయస్సు 60 సంవత్సరాలు): పాత నోట్లను మార్చడానికి మూడు రోజులు ప్రయత్నించి బ్యాంకులో గుండెపోటుతో మరణించారు.
రఘునాథ్ వర్మ (వయస్సు 70 సంవత్సరాలు): బ్యాంకు క్యూలో నిరీక్షిస్తూ మరణించారు.
షబానా (వయస్సు 20 సంవత్సరాలు): నగదు విత్డ్రా చేయలేక ఆత్మహత్య.
చైల్డ్: తల్లిదండ్రుల వద్ద పాత నోట్లు మాత్రమే ఉండటం, ఆస్పత్రి సిబ్బంది అంగీకరించకపోవడంతో మరణం.
కుష్ (వయస్సు 1 సంవత్సరం): రూ.100 నోట్ల కోసం తిరిగినా దొరకకపోవడంతో ఆస్పత్రిలో ట్రీట్మెంట్ ఆపేశారు. దాంతో తల్లిదండ్రులు అతడి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లారు.
వృద్ధురాలు: పాత నోట్లు లెక్కిస్తూ మరణించారు. పోలీసులకు ఆమె మృతదేహం పక్కన రూ. 2.69 లక్షల పాత నోట్లు లభ్యమయ్యాయి.
గుర్తు తెలియని వ్యక్తి: భూమిని విక్రయించగా వచ్చిన రూ.70 లక్షల పాత నోట్లు ఇంట్లో ఉన్నాయి. ఇంతలో నోట్ల రద్దు వార్త విని గుండెపోటుతో మరణం.
కమ్ట ప్రసాద్ (వయస్సు 75 సంవత్సరాలు): బ్యాంకు క్యూలో నిరీక్షిస్తూ మరణం. బాబు లాల్ (వయస్సు 50 సంవత్సరాలు): కుమార్తె పెళ్లి కోసం కరెన్సీ మార్పిడి చేయడంలో విఫలమై ఇంటికి తిరిగి వచ్చి గుండెపోటుతో మరణం.
మహ్మద్ ఇద్రీస్ (వయస్సు 45 సంవత్సరాలు): పాత నోట్లను మార్చుకునేందుకు బ్యాంకుకు వెళ్తుండగా గుండెపోటుతో మృతి.
తీర్థ్రాజి (వయస్సు 40 ఏళ్లు): రూ.1000 నోట్లను డిపాజిట్ చేసేందుకు బ్యాంకుకు వెళ్లి, అవి చట్టబద్ధం కావని చెప్పడంతో షాక్తో మరణం.
గుర్తు తెలియని వ్యక్తి: నోట్ల రద్దు ప్రకటన విన్న తర్వాత ఛాతీలో నొప్పి. వైద్యులు వచ్చేలోపు మరణం.
గుర్తు తెలియని వ్యక్తి: బ్యాంకు వెలుపల జరిగిన తొక్కిసలాటలో మరణం.
బాలిక (వయస్సు 4 సంవత్సరాలు): అనారోగ్యంతో ఉంది. చికిత్సకు డబ్బు అవసరం. బ్యాంకు క్యూలో నిలబడి తండ్రి చేతుల్లో మరణం.
సురేష్ (వయస్సు 18 సంవత్సరాలు): B.Sc. రెండో సంవ్సతరం విద్యార్థి. పరీక్ష ఫీజులకు డబ్బు తీయలేక ఉరేసుకుని ఆత్మహత్య.
ఇంద్రసాని దేవి (వయస్సు 70 సంవత్సరాలు): అనారోగ్యంతో బ్యాంకు క్యూలో నిల్చుని కార్డియాక్ అరెస్ట్తో మరణం. దహన సంస్కారాలకు డబ్బు కోసం ఆమె కోడలు అదే క్యూలో నిలబడాల్సి వచ్చింది.
మూర్తి దేవి (వయస్సు 85 సంవత్సరాలు): బ్యాంకు క్యూలో వేచిచూస్తూ మరణం.
అక్బర్ (వయస్సు 27 సంవత్సరాలు): కౌంటర్లో కరెన్సీ నోట్ల మార్పిడిని నిలిపివేసినట్లు ప్రకటన విని ఆత్మహత్య.
సలేకి (వయస్సు 68 సంవత్సరాలు): బ్యాంకు క్యూలో కుప్పకూలి, ఆస్పత్రిలో మరణం.
శేష్ కుమార్ (వయస్సు 50 సంవత్సరాలు): ఛాతిలో నొప్పి వచ్చింది. కొడుకు, భార్య నగదు కోసం బ్యాంకుకు వెళ్లి వచ్చేసరికి ఐదుగంటలు పట్టింది. అప్పటికే ఆయన మరణించారు.
రాకేష్ చంద్ (వయస్సు 54 సంవత్సరాలు): మాజీ సీఆర్పీఎఫ్ జవాన్. వైద్య చికిత్స కోసం చాలా రోజులుగా డబ్బు తీసేందుకు ప్రయత్నించి ఫలితం లేకపోవడంతో ఆత్మహత్య.
షమీమ్ (వయస్సు 45 సంవత్సరాలు): అనారోగ్యంతో సమయానికి డబ్బు అందక మరణం. అతని భార్య మందులకు డబ్బు కోసం నాలుగు రోజులు క్యూలో నిలబడ్డా ఫలితం దక్కలేదు.
సతీష్ కుమార్ (వయస్సు 48 సంవత్సరాలు): కుమారుడి పెళ్లి కోసం బ్యాంకు నుంచి నగదు తీయలేక ఆత్మహత్య.
పశ్చిమ బెంగాల్ (9 మరణాలు)
ధరణి కాంత భౌమిక్ (వయస్సు 56 సంవత్సరాలు): బ్యాంకు క్యూలో నిరీక్షిస్తూ మరణం. వరుసగా మూడు రోజులు క్యూలో ఉన్నారు.
మధు తివారీ: కొత్త నోట్లు తీసుకురాకుండా ATM నుంచి ఇంటికి తిరిగి వచ్చినందుకు ఆమెను భర్త హత్యచేశాడు.
శిబు నంది: బ్యాంకు నుంచి నగదు రాక, కూలీలకు వేతనాలు చెల్లించలేక ఆత్మహత్య.
సీతారాం: పాత నోట్లను మార్చుకోలేక, అప్పులు తీర్చలేక ఆత్మహత్య.
రాబిన్ ముఖర్జీ (వయస్సు 73 సంవత్సరాలు): బ్యాంకు క్యూలో నిరీక్షిస్తూ మరణం.
బిస్వాదేబ్ నస్కర్: పెన్షన్ తీసుకోవడానికి బ్యాంక్ క్యూలో నిరీక్షిస్తూ కుప్పకూలి మరణించారు.
కల్లోల్ రాయ్ చౌదరి: బ్యాంక్ క్యూలో నిరీక్షిస్తూ ప్రాణాలు కోల్పోయారు.
గుర్తు తెలియని వ్యక్తి: బ్యాంక్ క్యూలో నిరీక్షిస్తూ మరణించారు.
శ్రీమంత సర్కార్: మూడు వారాలపాటు ప్రయత్నించినా పాత కరెన్సీని మార్చుకోలేక ఆత్మహత్య.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

