న్యూఢిల్లీ, డిసెంబర్ 22: కరోనా వైరస్ సోకిన పురుషుల్లో వీర్యం నాణ్యత తగ్గిపోతున్నదని ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ అధ్యయనం వెల్లడించింది. వ్యాధి నుంచి కోలుకొన్నా కూడా మూడు నెలల పాటు వీర్యంలో శుక్రకణాల సంఖ్య, వాటి కదలిక తక్కువగా ఉంటున్నదని తెలిపింది. కరోనా నుంచి కోలుకొన్న 150 మంది పురుషులపై అధ్యయనం చేసి ఈ వివరాలను వెల్లడించింది. వైరస్ నుంచి కోలుకొన్న తర్వాత నెల రోజుల్లోపు వీర్యాన్ని సేకరించి పరీక్షించగా శుక్రకణాల సంఖ్య 37% తగ్గింది. శుక్రకణాల కదలిక 60% తగ్గింది. వ్యాధి నుంచి కోలుకొన్న మూడు నెలల తర్వాత సాధారణ స్థాయికి చేరుకొంటున్నట్టు అధ్యయనం పేర్కొన్నది.