వాట్సాప్‌తో కరోనా టెస్టు!

- టెక్నాలజీని అభివృద్ధి చేసిన ఆర్ట్పార్క్ స్టార్టప్
- ఎక్స్‌రే-కృత్రిమ మేధ సాయంతో కరోనా పరీక్ష
- ఎక్స్‌రేను ‘ఎక్స్‌రే సేతు’ వెబ్సైట్లో వాట్సాప్‌తో అప్లోడ్ చేస్తే 10-15 నిమిషాల్లో ఫలితం
న్యూఢిల్లీ, జూన్ 2: కరోనా నిర్ధారణ పరీక్షల్లో ఆర్టీపీసీఆర్ పరీక్షల తర్వాత సీటీ స్కానింగ్ కీలకంగా మారింది. ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో నెగెటివ్ వచ్చినా కూడా స్కానింగ్‌లో ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ గుర్తించిన సందర్భాలు చాలా ఉన్నాయి. సీటీ స్కానింగ్‌తో రేడియేషన్ భయం, ఆర్టీపీసీఆర్ పరీక్షల ఫలితాలు రోజుల తరబడి ఆలస్యం కావడంతో వ్యాధి తీవ్రత ఎక్కువ ఉన్నవారికి కూడా చికిత్స సకాలంలో అందడం లేదు. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో ఆర్టీపీసీఆర్, సీటీస్కానింగ్ సదుపాయాలు తక్కువ. ఈ నేపథ్యంలో ఎక్స్‌రేను ఉపయోగించి కరోనా నిర్ధారణ చేసే సాంకేతికతను బెంగళూరుకు చెందిన ఆర్ట్కార్ట్ అనే స్టార్టప్ అభివృద్ధి చేసింది. దీనికి డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం దీనికి రూ. 230 కోట్ల ఆర్థిక సాయం చేసింది. కృత్రిమ మేధ సాయంతో పనిచేసే ఈ టెక్నాలజీని ‘ఎక్స్రేసేతు’ అని పిలుస్తున్నారు. వైద్యులు ఎక్స్‌రేల ఫొటోలను వాట్సాప్ ద్వారా www. xraysetu.com వెబ్సైట్లో అప్లోడ్ చేస్తే 10-15 నిమిషాల్లో ఫలితం తెలుస్తుంది. ఇది కొవిడ్‌తో పాటు టీబీ, న్యుమోనియా లాంటి 14 రకాల ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లను గుర్తించగలదు. ఇండియాలో 1000 మందికిపైగా కరోనా రోగులపై ఈ పరిశోధనలు నిర్వహించారు.
గ్రామీణ ప్రాంతాలే లక్ష్యం
గ్రామీణ ప్రాంతాలే లక్ష్యంగా ఈ సాంకేతికతను అభివృద్ధి చేసినట్టు ఆర్ట్పార్క్ సీఈవో ఉమాకాంత్ సోని చెప్పారు. ఇప్పటివరకు 500 మంది డాక్టర్లు సేవలను వినియోగించుకొన్నారని పేర్కొన్నారు. వచ్చే 15 రోజుల్లో 10వేల మంది వైద్యులకు ఈ సాంకేతికత అందేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు తెలిపారు. 6-8 నెలలవరకు తమ సేవలకు ఎలాంటి రుసుము వసూలు చేయబోమని చెప్పారు.
ఫలితం తెలుసుకోవాలంటే ఎలా
- డాక్టర్ www. xraysetu.com లోకి వెళ్లాలి.
- ఎక్స్రేసేతు బీటా బటన్‌పై క్లిక్ చేయాలి.
- వాట్సాప్ చాట్‌బాక్స్ ఓపెన్ అవుతుంది.
- వైద్యుడు +91 80461638638 నంబర్‌కు వాట్సాప్ చేయాలి.
- ఎక్స్‌రే సేతు సర్వీస్ అందుబాటులోకి వస్తుంది.
- తర్వాత వైద్యుడు రోగి ఎక్స్‌రేను వాట్సాప్ చేయాలి.
- 10-15 నిమిషాల్లో ఫలితం తెలుస్తుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- corona
- Corona Test
- Covid19
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

