Cop’s Son Running Prostitution Racket | హోటల్లో వ్యభిచారం రాకెట్ నిర్వహిస్తున్న పోలీస్ అధికారి కొడుకు.. అరెస్ట్ చేసిన పోలీసులు
Cop's Son Running Prostitution Racket | పోలీస్ అధికారి కుమారుడు ఒక హోటల్లో వ్యభిచారం రాకెట్ నిర్వహిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న క్రైమ్ బ్రాంచ్ పోలీసులు విటులుగా నటించారు. డబ్బులు తీసుకున్న పోలీస్ అధికారి కొడుకుతోపాటు వ్యభిచార దందాలో అతడికి సహకరిస్తున్న మహిళను అరెస్ట్ చేశారు.
ముంబై: పోలీస్ అధికారి కుమారుడు ఒక హోటల్లో వ్యభిచారం రాకెట్ నిర్వహిస్తున్నాడు. (Cop’s Son Running Prostitution Racket) ఈ విషయం తెలుసుకున్న క్రైమ్ బ్రాంచ్ పోలీసులు విటులుగా నటించారు. డబ్బులు తీసుకున్న పోలీస్ అధికారి కొడుకుతోపాటు వ్యభిచార దందాలో అతడికి సహకరిస్తున్న మహిళను అరెస్ట్ చేశారు. ముగ్గురు మహిళలకు విముక్తి కల్పించారు. మహారాష్ట్రలోని థానేలో ఈ సంఘటన జరిగింది. విశ్వాస్ వెజ్ హోటల్లో వ్యభిచారం రాకెట్ నిర్వహిస్తున్నట్లు పోలీసులకు తెలిసింది. మార్చి 21న ఒక ఏజెంట్ కొందరు మహిళలను ఆ హోటల్‌కు తీసుకువస్తున్నట్లు సమాచారం అందింది.
కాగా, క్రైమ్ బ్రాంచ్‌లోని యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ సెల్ పోలీసులు రంగంలోకి దిగారు. ఒక పోలీస్ విటుడిగా నటించాడు. శాంతాక్రూజ్‌లో నివసిస్తున్న అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ కుమారుడైన అశ్విన్ కదమ్‌తో రూ.15,000కు డీల్ కుదుర్చుకున్నాడు. ఆ డబ్బు తీసుకున్న అతడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. వ్యభిచార రాకెట్‌పై దర్యాప్తు చేయగా 31 ఏళ్ల కృతికా లాడ్ అనే మహిళ అతడికి సహకరిస్తున్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. దీంతో శుక్రవారం ఆమెను అరెస్ట్ చేశారు.
మరోవైపు వ్యభిచార కూపం నుంచి ముగ్గురు మహిళలను పోలీసులు రక్షించారు. సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్న పోలీస్ అధికారి కుమారుడు, అతడికి సహకరిస్తున్న మహిళపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Narayanpet | నారాయణపేటలో కొట్టుకున్న బీఎస్పీ- కాంగ్రెస్ నాయకులు
ప్రేమ వేధింపులకు యువతి బలి ?
Sukhbir Badal | బీజేపీతో పొత్తు ఉండొచ్చు.. ఆప్, కాంగ్రెస్‌లు ప్రత్యర్థులే.. శిరోమణి అకాళిదళ్ నేత సుఖ్బీర్ సింగ్
KTR | కేసీఆర్‌కు ఎప్పుడు ఓటు వేయాలా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు : కేటీఆర్
పేద విద్యార్థిని వైద్య విద్యకు ఆర్థిక చేయూత
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

