Cop’s Son Killed | పోలీస్ కుమారుడ్ని కిడ్నాప్ చేసి హత్య.. లెటర్ ద్వారా రూ.50 లక్షలు డిమాండ్
Cop’s Son Killed | పోలీస్ కానిస్టేబుల్ కుమారుడైన 6 ఏళ్ల బాలుడ్ని కిడ్నాప్ చేసి హత్య చేశారు. ఒక లేఖ ద్వారా రూ.50 లక్షలను కిడ్నాపర్లు డిమాండ్ చేశారు. చివరకు చెరకు తోటలో బాలుడి మృతదేహాన్ని పోలీస్ కుటుంబం గుర్తించింది.
లక్నో: పోలీస్ కానిస్టేబుల్ కుమారుడైన 6 ఏళ్ల బాలుడ్ని కిడ్నాప్ చేసి హత్య చేశారు. (Cop’s Son Killed ) ఒక లేఖ ద్వారా రూ.50 లక్షలను కిడ్నాపర్లు డిమాండ్ చేశారు. చివరకు చెరకు తోటలో బాలుడి మృతదేహాన్ని పోలీస్ కుటుంబం గుర్తించింది. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. పోలీస్ కానిస్టేబుల్ గోపాల్ యాదవ్, సహరాన్‌పూర్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. ఆదివారం ఉదయం 8 గంటల సమయంలో ధన్పూర్ గ్రామంలో ఇంటి బయట ఆడుకుంటున్న అతడి ఆరేళ్ల కుమారుడు పునీత్ అదృశ్యమయ్యాడు. ఆ బాలుడి విడుదలకు రూ.50 లక్షలు డిమాండ్ చేస్తూ గోపాల్ యాదవ్‌కు ఒక లేఖ అందింది.
కాగా, కుమారుడి అదృశ్యంపై కానిస్టేబుల్ కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్థానిక మహిళ ఆ బాలుడ్ని కిడ్నాప్ చేసి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. దీంతో తొలుత ఆ మహిళను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అయితే గ్రామంలోని చెరకు తోటలో బాలుడి మృతదేహాన్ని కానిస్టేబుల్ కుటుంబం గుర్తించింది.
మరోవైపు ఉద్దేశపూర్వకంగా ఆ బాలుడ్ని హత్య చేసి ఉంటారని కానిస్టేబుల్ ఫ్యామిలీ ఆరోపించింది. మరో కుటుంబంతో ఉన్న భూవివాదం కారణం కావచ్చని అనుమానించింది. ఈ నేపథ్యంలో బాలుడి హత్యపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు మహిళలతో సహా నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. రూ.50 లక్షలు డిమాండ్ చేసిన లేఖను కూడా పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

