తవాంగ్ ఘర్షణపై మోదీ సర్కార్ తీరును తప్పుపట్టిన కాంగ్రెస్
అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ వద్ద భారత్-చైనా సైనికుల ఘర్షణ వ్యవహారంలో మోదీ సర్కార్ లక్ష్యంగా విమర్శల దాడిని కాంగ్రెస్ తీవ్రతరం చేసింది.
న్యూఢిల్లీ : అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ వద్ద భారత్-చైనా సైనికుల ఘర్షణ వ్యవహారంలో మోదీ సర్కార్ లక్ష్యంగా విమర్శల దాడిని కాంగ్రెస్ తీవ్రతరం చేసింది. మోదీ ప్రభుత్వ డ్రాగన్‌పై కన్నెర్ర చేయకుండా చైనా గ్లాస్లు కవర్ చేస్తున్నట్టుగా కనిపిస్తోందని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. భారత పార్లమెంట్లో చైనాకు వ్యతిరేకంగా మాట్లాడేందుకు కేంద్రం అనుమతించదా అని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ట్వీట్ చేశారు.
గతవారం భారత్-చైనా సైనికుల మధ్య సరిహద్దు ఘర్షణపై సమగ్ర చర్చ చేపట్టాలన్న విపక్షాల డిమాండ్‌కు ప్రభుత్వం అనుమతించకుండా అవాంతరాలు కలిగించిన విషయాన్ని ఖర్గే ప్రస్తావించారు. సరిహద్దు వివాదం నేపధ్యంలో జరిగిన ఘర్షణలపై చర్చకు విపక్షాలు పట్టుపట్టగా స్పీకర్ అనుమతించకపోవడాన్ని నిరసిస్తూ బుధవారం విపక్ష సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. తవాంగ్ సెక్టార్లో యథాతథ స్ధితిని మార్చేందుకు ప్రయత్నించిన చైనా సైనికులను భారత దలాలు నియంత్రించాయని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం సభలో వెల్లడించారు.
ఇరు సేనల మధ్య జరిగిన ఘర్షణలో భారత సైనికులకు ఎలాంటి గాయాలు కాలేదని, ప్రాణనష్టం జరగలేదని సింగ్ పేర్కొన్నారు. చైనా అధికారుల దృష్టికి భారత ప్రభుత్వం దౌత్య మార్గాల్లో ఈ అంశాన్ని తీసుకువెళ్లిందని చెప్పారు. సరిహద్దులో చైనా దూకుడును భారత్ దీటుగా ఎదుర్కోవడం లేదని, డ్రాగన్ ఆక్రమణకు దిగుతున్నా భారత్ నోరు మెదపడం లేదని మోదీ సర్కార్ లక్ష్యంగా కాంగ్రెస్ సహా విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
Assam Girl | అసోం యువతి మృతి కేసులో ట్విస్ట్.. రైల్వే ట్రాక్ పక్కనే మరో డెడ్‌బాడీ..!
Nepal Falsh Floods | నేపాల్‌లో మళ్లీ అకస్మిక వరద.. నేలమట్టమైన ఇళ్లు, బ్రిడ్జిలు..!
Digital arrest | డిజిటల్ అరెస్ట్ వలలో చిక్కి యువతి విలవిల.. రూ.2.5 లక్షలు పోగొట్టుకుని ఆత్మహత్య..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

