Madhya Pradesh Polls | శివరాజ్ సింగ్ చౌహాన్‌పై కాంగ్రెస్ అభ్యర్ధిగా బరిలో రామాయణ్ నటుడు
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో (Madhya Pradesh Polls) పోటీచేసే 144 మంది అభ్యర్ధులతో కూడిన తొలి జాబితాను కాంగ్రెస్ ఆదివారం విడుదల చేసింది.
భోపాల్ : మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో (Madhya Pradesh Polls) పోటీచేసే 144 మంది అభ్యర్ధులతో కూడిన తొలి జాబితాను కాంగ్రెస్ ఆదివారం విడుదల చేసింది. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌పై 2008 రామాయణ్‌లో హనుమాన్ పాత్రధారి విక్రమ్ మస్తల్‌ను కాంగ్రెస్ బరిలో దింపింది. బుధ్ని అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వీరిద్దరూ తలపడనున్నారు.
ఈ ఏడాది జులైలో కాంగ్రెస్‌లో చేరిన మస్తల్‌ను కీలక నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల రణక్షేత్రంలో దింపింది. కమల్ నాథ్ సమక్షంలో మస్తల్ కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. ఇక బీజేపీ ఇటీవల విడుదల చేసిన నాలుగో జాబితాలో చౌహాన్ బుధ్ని నియోజకవర్గం నుంచి పోటీచేస్తారని వెల్లడించింది. బుధ్ని నియోజకవర్గం చౌహాన్‌కు కంచుకోటగా పేరొందింది.
2018 అసెంబ్లీ ఎన్నికల్లో చౌహాన్ ఈ సీటు నుంచి ఏకంగా 58,999 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఇక కాంగ్రెస్ జాబితాలో పార్టీ రాష్ట్ర శాఖ చీఫ్ కమల్‌నాధ్‌కు చింద్వారా స్ధానం దక్కింది. మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ కుమారుడు జైవర్ధన్ సింగ్ రాఘవఘడ్ స్ధానం నుంచి చోటు దక్కింది. ఇక మధ్యప్రదేశ్‌లో గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొలువుతీరినా ఆపై కమల్‌నాధ్ సర్కార్ కుప్పకూలడంతో శివరాజ్ సింగ్ చౌహాన్ సారధ్యంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైంది.ఇక మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 17న ఒకే విడతలో ముగియనుండగా డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు.
Read More :
Operation Ajay | ఇజ్రాయెల్ నుంచి ఢిల్లీకి నాలుగో ఫ్లైట్.. స్వదేశానికి మరో 274 మంది
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

