వైవిధ్యమే న్యాయవ్యవస్థకు బలం: ఎన్వీ రమణ
న్యాయమూర్తుల ఎంపికలో వైవిధ్యం కనబర్చాలని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు.
న్యూఢిల్లీ, అక్టోబర్ 1: న్యాయమూర్తుల ఎంపికలో వైవిధ్యం కనబర్చాలని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. ధర్మాసనంపై ఉండే జడ్జిలు వివిధ వర్గాలకు చెందినవారైతే, వారి నుంచి విభిన్నమైన అభిప్రాయాలు వస్తాయని అన్నారు. మైనారిటీలు, వివిధ మతాలు, సంస్కృతులకు చెందినవారు న్యాయస్థానాల్లో ఉండేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. శనివారం కల్చరల్ డైవర్సిటీ అండ్ ది లీగల్ ప్రొఫెషన్ అంశంపై వర్చువల్గా మాట్లాడిన ఆయన.. తాను సీజేఐగా పనిచేసినప్పుడు కోర్టు ధర్మాసనాలపై వివిధ వర్గాల వారి ప్రాతినిథ్యం ఉండేలా చేశానని తెలిపారు. అలా ఎంతో మంది మహిళా జడ్జిలను నియమించామని వెల్లడించారు. భవిష్యత్తులో భారత తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిని చూసే అవకాశం రావొచ్చని పేర్కొన్నారు. న్యాయమూర్తుల నియామక పద్ధతి కొలీజియంపై ప్రభుత్వం సహా వివిధ వర్గాల నుంచి వస్తున్న అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

