LPG Cylinder | సామాన్యులకు షాక్.. పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర
దీపావళి పండుగ వేళ దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. ఇప్పటికే పెరిగిన ధరలతో అల్లాడుతున్న సామాన్యులపై మరో భారం మోపింది. పెట్రో ధరలు తగ్గుతాయంటూ లీకులిస్తూ వస్తున్న బీజేపీ సర్కార్.. గ్యాస్ సిలిండర్ (LPG cylinder) ధరను మాత్రం పెంచింది.
న్యూఢిల్లీ: దీపావళి పండుగ వేళ దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. ఇప్పటికే పెరిగిన ధరలతో అల్లాడుతున్న సామాన్యులపై మరో భారం మోపింది. పెట్రో ధరలు తగ్గుతాయంటూ లీకులిస్తూ వస్తున్న బీజేపీ సర్కార్.. గ్యాస్ సిలిండర్ (LPG cylinder) ధరను మాత్రం పెంచింది. వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కిలోల ఎల్పీజీ సిండర్పై మరో రూ.62 బాదింది. దీంతో ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ ధర రూ.1802కు చేరింది. పెరిగిన ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని దేశీయ చమురు కంపెనీలు ప్రకటించాయి. అయితే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల ధర జోలికి మాత్రం వెల్లకపోవడం కాస్త ఊరటనిచ్చే అంశం.
తాజా పెంపుతో హైదరాబాద్లో కమర్షియల్ సిలిండర్ ధర రూ.2028కి పెరిగింది. కోల్కతాలో రూ.1911.50, ముంబైలో రూ.1754.50, చెన్నైలో రూ.1964.50గా ఉన్నది. కాగా, వాణిజ్య అవవసరాలకు వినియోగించే సిలిండర్ ధర గత కొన్ని నెలలుగా పెరుగుతూ వస్తున్న విషయం తెలిసిందే.
ఇక డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ఢిల్లీలో 14 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధర రూ.803గా ఉండగా కోల్కతాలో రూ.829, ముంబైలో రూ.802.50, చెన్నైలో రూ.818.50, విజయవాడలో రూ.827.50గా ఉన్నది. హైదరాబాద్లో మాత్రం పై అన్ని నగరాల్లో కంటే అత్యధికంగా రూ.855కు లభిస్తున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

