రూ.36.5 తగ్గిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర
Commercial Gas Cylinder | వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ ధర మరోసారి తగ్గింది. దేశీయ చమురు కంపెనీలు 19 కిలోల కమర్షియల్ సిలిండర్‌పై రూ.25.50 తగ్గించాయి. దీంతో ఢిల్లీలో సిలిండర్ ధర రూ.1859కి
న్యూఢిల్లీ: వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ ధర మరోసారి తగ్గింది. దేశీయ చమురు కంపెనీలు 19 కిలోల కమర్షియల్ సిలిండర్‌పై రూ.25.50 తగ్గించాయి. దీంతో ఢిల్లీలో సిలిండర్ ధర రూ.1859కి చేరింది. ఇక హైదరాబాద్‌లో రూ.36.50 తగ్గడంతో రూ.2099.5గా ఉన్న సిలిండర్ రూ.2064కు పడిపోయింది.
వాణిజ్య సిలిండర్ ధర కోల్‌కతాలో రూ.1959, ముంబైలో 1811.5, చెన్నైలో రూ.2009.5గా ఉన్నది. కాగా, ఈఏడాది గరిష్ఠస్థాయికి చేరిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు గత జులై నుంచి తగ్గుతూ వస్తున్నాయి. జులై నెలలో రూ.135, ఆగస్టులో రూ.36 మేర తగ్గిన ధర సెప్టెంబర్ 1న మరో రూ.91.50 మేర తగ్గింది. తాజాగా రూ.25.5 కోత విధించాయి. అయితే గృహావసరాలకు వినియోగించే సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పూ లేకపోవడం విశేషం.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

