Cocaine | ఐజీఐ విమానాశ్రయంలో భారీగా పట్టుబడిన కొకైన్.. కెన్యాకు చెందిన ప్రయాణికుడు అరెస్ట్
దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో (IGI Airport) పెద్దమొత్తంలో కొకైన్ (Cocaine) పట్టుబడింది. ఆఫ్రికా దేశం నైరోబీ (Nairobi) నుంచి ముంబై (Mumbai) వెళ్తున్న విమానం ఢిల్లీలో ఆగింది.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో (IGI Airport) పెద్దమొత్తంలో కొకైన్ (Cocaine) పట్టుబడింది. ఆఫ్రికా దేశం నైరోబీ (Nairobi) నుంచి ముంబై (Mumbai) వెళ్తున్న విమానం ఢిల్లీలో ఆగింది. ఈ సందర్భంగా డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు ప్రయాణికులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నైరోబి నుంబి ముంబై వెళ్తున్న కెన్యాకు (Kenya) చెందిన ప్రయాణికుడిని చెక్‌చేశారు. దీంతో అతని లగేజీలో 1,698 గ్రాముల కొకైన్ లభించింది. దీని విలువ అంతర్జాతీయ మార్కెట్లో సుమారు రూ.17 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు.
నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని, విచారణ సందర్భంగా తాను ముంబై వెళ్తున్నట్లు చెప్పాడని వెల్లడించారు. దీంతో డ్రగ్స్‌ను (Drugs) ముంబైకి తరలిస్తున్నారని స్పష్టమైందని చెప్పారు. అనంతరం ముంబైలో ఆర్డర్‌ను తీసుకోవడానికి వచ్చిన కెన్యా జాతీయురాలిని కూడా అరెస్టు చేశామని తెలిపారు. నిందితులిద్దరిపై నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (NDPS) యాక్ట్ కింద కేసు నమోదుచేసినట్లు వెల్లడించారు. కాగా, ఈ ఏడాది జనవరి నుంచి జూలై మధ్యకాలంలో దేశవ్యాప్తంగా డీఆర్ఐ అధికారులు 42 పర్యాయాలు కొకైన్ (Cocaine), హెరాయిన్‌ను (Heroin) సీజ్ చేశారు. ఇందులో 31 కేజీల కొకైన్ ఉండగా, 96 కికోల హెరాయిన్ ఉన్నదని పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
KTR | కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం.. కేటీఆర్ ధ్వజం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

