Rishi Sunak | రిషీ సునాక్ కేబినెట్లో మరో భారత సంతతి మహిళ
Rishi Sunak | రిషీ సునాక్ (Rishi Sunak) నేతృత్వంలోని బ్రిటన్ కేబినెట్లో మరో భారత సంతతి మహిళ చేరారు. గోవా మూలాలున్న 38 ఏళ్ల క్లెయిర్ కౌటినో (Claire Coutinho) ను ఇంధనశాఖ మంత్రిగా గురువారం ప్రధాని రిషి సునాక్ నియమించారు.
లండన్: రిషీ సునాక్ (Rishi Sunak) నేతృత్వంలోని బ్రిటన్ కేబినెట్లో మరో భారత సంతతి మహిళ చేరారు. గోవా మూలాలున్న 38 ఏళ్ల క్లెయిర్ కౌటినో (Claire Coutinho) ను ఇంధనశాఖ మంత్రిగా గురువారం ప్రధాని రిషి సునాక్ నియమించారు. ప్రస్తుతం ఇంధనశాఖ మంత్రిగా ఉన్న గ్రాంట్ షాప్స్ రక్షణ మంత్రిగా పదోన్నతి పొందారు.
ఇంధనశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టడం తనకు చాలా సంతోషంగా ఉందని, ప్రధానితో కలిసి పనిచేసి ఇంధన భద్రత కల్పించేందుకు ప్రయత్నిస్తానని, ఇళ్లలో వాడే కరెంటు బిల్లులను తగ్గించేందుకు కృషి చేస్తానని క్లెయిర్ కౌటినో తెలిపారు. శుద్ధ, చవకైన, స్థానికంగా ఉత్పత్తి చేసే ఇంధనానికి ప్రాధాన్యమిస్తానని కౌటినో తన నియామకం అనంతరం ట్వీట్ చేశారు.
సునాక్‌లాగే బ్రిటన్‌లో జన్మించిన కౌటినో ఆక్స్‌ఫర్డ్‌లో గణితం, ఫిలాసఫీలో మాస్టర్స్ చేశారు. ఈస్ట్ సర్రే నుంచి పార్లమెంటు సభ్యురాలిగా ఎన్నికయ్యారు. ఇప్పుడు సునాక్ కేబినెట్లో పిన్న వయస్కురాలైన మంత్రిగా నియమితురాలయ్యారు. గతంలో బ్రిటన్ ట్రెజరీ విభాగానికి ప్రత్యేక సలహాదారుగా, సునాక్ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు సహాయకురాలిగా, ఖజానాకు ఛాన్సెలర్‌గా కౌటినో పని చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

