Supreme Court: జడ్జీల నియామకాల వార్తలపై సీజేఐ రమణ తీవ్ర అసంతృప్తి
కొత్త జడ్జీల నియామకంపై మీడియాలో వార్తలు రావడంపై సుప్రీంకోర్టు( Supreme Court ) ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాంటి నియామకాలపై రిపోర్ట్ చేసేటప్పుడు మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన అన్నారు.

న్యూఢిల్లీ: కొత్త జడ్జీల నియామకంపై మీడియాలో వార్తలు రావడంపై సుప్రీంకోర్టు( Supreme Court ) ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాంటి నియామకాలపై రిపోర్ట్ చేసేటప్పుడు మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన అన్నారు. కొత్త జడ్జీల నియామకంపై సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సులు ఇవీ అంటూ మీడియాలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సిఫార్సుల ప్రకారం 2027లో దేశానికి తొలి మహిళా సీజేఐ రాబోతున్నారని, ఆమె కర్ణాటక జడ్జిగా ఉన్న నాగరత్నే కావచ్చని వార్తలు వచ్చాయి. అయితే ఇలాంటి నియామకాలపై అధికారిక ప్రకటన కంటే ముందే వార్తలు రావడం ప్రతికూల ప్రభావం చూపుతుందని ఎన్వీ రమణ అన్నారు.
జడ్జీల నియామక ప్రక్రియకు ఓ పవిత్రత, హుందాతనం ఉంటాయి. మీడియా స్నేహితులు ఈ ప్రక్రియ పవిత్రతను అర్థం చేసుకోవాలి, గుర్తించాలి అని రమణ అన్నారు. ఇలాంటి బాధ్యతా రహిత రిపోర్ట్‌ల కారణంగా అర్హులైన అభ్యర్థులకు పదవులు దక్కని ఘటనలు ఎన్నో ఉన్నాయి. వీటిపై నేను చాలా అసంతృప్తిగా ఉన్నాను. ఇలాంటి తీవ్రమైన అంశంపై సీనియర్ జర్నలిస్టులు, మీడియా హౌజ్‌లు కాస్త పరిణతితో, బాధ్యతాయుతంగా వ్యవహరించాలి అని సీజేఐ స్పష్టం చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

