Woman Strangles Newborn To Death | పసిబిడ్డకు పాలిస్తూ.. గొంతు నొక్కి చంపిన తల్లి
Woman Strangles Newborn To Death | ఒక మహిళ దారుణానికి పాల్పడింది. ఆరో రోజుల కిందట పుట్టిన నవజాత శిశువుకు పాలు ఇస్తున్న సందర్భంగా గొంతు నొక్కి చంపింది. తన బిడ్డ కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే నాలుగో కాన్పులో కూడా ఆడ పిల్ల పుట్టడంతో సమాజం నుంచి హేళన భరించలేక హత్య చేసినట్లు చివరకు ఒప్పుకున్నది.
న్యూఢిల్లీ: ఒక మహిళ దారుణానికి పాల్పడింది. ఆరో రోజుల కిందట పుట్టిన నవజాత శిశువుకు పాలు ఇస్తున్న సందర్భంగా గొంతు నొక్కి చంపింది. (Woman Strangles Newborn To Death) తన బిడ్డ కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే నాలుగో కాన్పులో కూడా ఆడ పిల్ల పుట్టడంతో సమాజం నుంచి హేళన భరించలేక పసిపాపను హత్య చేసినట్లు చివరకు ఒప్పుకున్నది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. పశ్చిమ ఢిల్లీలోని ఖ్యాలా పోలీస్ స్టేషన్‌కు శుక్రవారం తెల్లవారుజామున ఫోన్ కాల్ వచ్చింది. ఆరు రోజుల బిడ్డ కనిపించడం లేదని 28 ఏళ్ల శివాని ఫిర్యాదు చేసింది. గురువారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యిన తర్వాత తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లినట్లు ఆమె తెలిపింది. గత రాత్రి బిడ్డకు పాలిచ్చి పడుకోబెట్టానని, నిద్ర లేచి చూసేసరికి పక్కన పాప లేదని ఆందోళన వ్యక్తం చేసింది.
కాగా, పోలీసులు వెంటనే ఆ ఇంటికి చేరుకున్నారు. ఆ ఇంటి పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. అదృశ్యమైన పసి బిడ్డ కోసం పోలీసులు వెతకసాగారు. అయితే కుట్లు తీయడానికి ఆసుపత్రికి వెళ్లాలని పోలీసులతో శివాని చెప్పింది. ఒకపక్క బిడ్డ కనిపించకపోయినా ఆసుపత్రికి వెళ్తానని ఆ మహిళ అనడంతో పోలీసులు కాస్త అనుమానించారు. అయితే వైద్య పరిస్థితి నేపథ్యంలో ఆమెను అడ్డుకోలేదు.
మరోవైపు అదృశ్యమైన పసిపాప కోసం పోలీసులు వెతికారు. ఎదురింటి రూఫ్‌పై ఒక బ్యాగ్ కనిపించింది. దానిని తెరిచి చూడగా పసిపాప అందులో కనిపించింది. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు డాక్టర్లు చెప్పారు. దీంతో పోస్ట్‌మార్టం కోసం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.
కాగా, బిడ్డ తల్లి ప్రవర్తనపై అనుమానించిన పోలీసులు ఆమెను ప్రశ్నించారు. దీంతో బోరున ఏడ్చిన శివాని, కూతుర్ని తానే చంపినట్లు చెప్పింది. ఈ బిడ్డ నాల్గవ ఆడపిల్ల అని, కాన్పు తర్వాత ఇద్దరు ఆడ పిల్లలు మరణించినట్లు ఆమె తెలిపింది. నాలుగో కాన్పులో కూడా ఆడపిల్ల పుట్టడంతో సమాజం నుంచి హేళన భరించలేక హత్య చేసినట్లు పోలీసులకు చెప్పింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్ట్‌మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత తగిన చర్యలు చేపడతామని పోలీస్ అధికారి వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women’s Asian Champions Trophy | చైనాపై భారత్ ఘన విజయం.. ఆసియా హాకీ ఛాంపియన్‌గా హ్యాట్రిక్
Child Marriage | టెంకంపేట్లో బాల్యవివాహానికి బ్రేక్.. అధికారుల చొరవతో నిలిపివేత
Begumpet Students | సిద్దిపేట వైజ్ఞానిక ప్రదర్శనలో బేగంపేట విద్యార్థుల ప్రతిభ.. రాష్ట్రస్థాయికి స్మార్ట్ వాకర్ ప్రాజెక్టు
Myanmar military bombs school | స్కూల్‌పై మయన్మార్ ఆర్మీ బాంబు దాడి.. మహిళలు, పిల్లలతో సహా 30 మంది మృతి
ఓబీసీ కులగణన తర్వాతే డీలిమిటేషన్ చేపట్టాలి.. బీసీ మహిళలకు సబ్‌కోటా కల్పించాలి.. జాజుల శ్రీనివాస్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

