పదేండ్ల వయసులోనే కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించాలి
గుండె జబ్బులు పెద్దవారికే వస్తాయనుకుంటే పొరబడినట్లే.. చిన్నారులు, యువతలోనూ గుండె సమస్యలు బయటపడుతున్న నేపథ్యంలో పిల్లల ఆరోగ్యంపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపించాలని ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ అశోక్ సేథ్ సూచించారు. పదేండ్ల వయసులో కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించడం ద్వారా గుండె జబ్బుల ముప్పును ముందుగానే గుర్తించే అవకాశం ఉంటుందని తెలిపారు. గురువారం జరిగిన ‘ఇండియా టుడే హెల్త్ సమ్మిట్-2026’లో ఈ విషయాలను వెల్లడించారు.
- తద్వారా గుండె జబ్బుల ముప్పును ముందుగానే గుర్తించవచ్చు
- హెల్త్ సమ్మిట్‌లో నిపుణుల సూచన
న్యూఢిల్లీ: గుండె జబ్బులు పెద్దవారికే వస్తాయనుకుంటే పొరబడినట్లే.. చిన్నారులు, యువతలోనూ గుండె సమస్యలు బయటపడుతున్న నేపథ్యంలో పిల్లల ఆరోగ్యంపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపించాలని ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ అశోక్ సేథ్ సూచించారు. పదేండ్ల వయసులో కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించడం ద్వారా గుండె జబ్బుల ముప్పును ముందుగానే గుర్తించే అవకాశం ఉంటుందని తెలిపారు. గురువారం జరిగిన ‘ఇండియా టుడే హెల్త్ సమ్మిట్-2026’లో ఈ విషయాలను వెల్లడించారు.
ఫోర్టిస్ ఎస్కార్ట్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ డాక్టర్ అశోక్ సేథ్ మాట్లాడుతూ కొందరు యువకులు అకస్మాత్తుగా మరణిస్తున్నారని, వారికి చిన్నప్పటి నుంచే గుర్తించని గుండె సమస్యలు ఉన్నట్లు బయటపడుతున్నదన్నారు. భారతదేశంలో సంభవించే గుండెపోటు కేసుల్లో సుమారు 50 శాతం 50 ఏండ్లలోపు వారిలోనే నమోదవుతున్నట్లు తెలుస్తున్నదన్నారు. గత 15 ఏండ్లలో గుండె జబ్బులు 200 శాతం పెరిగినట్లు తెలిపారు. అంతర్గత అవయవాల చుట్టూ పేరుకునే కొవ్వు ఇన్సులిన్ నిరోధకత, మధుమేహం, ఇతర జీవక్రియ సంబంధిత సమస్యల ముప్పును పెంచుతుందని డాక్టర్ అశోక్ సేథ్ వివరించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

