New Criminal Code | విమర్శించడమే పనిగా పెట్టుకున్న విపక్షాలు : చిరాగ్ పాశ్వాన్
New Criminal Code : నూతన నేర న్యాయ చట్టాలపై (New Criminal Code) విస్తృత సంప్రదింపుల అనంతరమే చట్టాలను ఆమోదించడం జరిగిందని కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ స్పష్టం చేశారు.
New Criminal Code : నూతన నేర న్యాయ చట్టాలపై (New Criminal Code) విస్తృత సంప్రదింపుల అనంతరమే చట్టాలను ఆమోదించడం జరిగిందని కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ స్పష్టం చేశారు. ప్రభుత్వం చేపట్టిన ప్రతి పనినీ విమర్శించడం, గుడ్డిగా వ్యతిరేకించడం చేయరాదని విపక్షాలకు మంత్రి హితవు పలికారు. ఇక విపక్షాలు ప్రభుత్వాన్ని అదే పనిగా వ్యతిరేకించడం దురదృష్టకరమని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు.
విపక్షాలు ప్రభుత్వంపై అదే పనిగా విమర్శలు గుప్పించడం, ప్రతి పనినీ వ్యతిరేకించడం ద్వారా అరాచక వాతావరణం సృష్టిస్తున్నాయని మండిపడ్డారు. ఇక నూతన నేర న్యాయ చట్టాల అమలుపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. స్వాతంత్రం సిద్ధించిన 77 ఏండ్ల తర్విఆత మన నేర న్యాయ వ్యవస్ధ పూర్తిగా స్వదేశీగా మారిందని, ఈ సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియచేస్తున్నానని అన్నారు. భారతీయ విలువల ఆధారంగా నూతన చట్టాలు పనిచేస్తాయని చెప్పుకొచ్చారు.
వలసవాద చట్టాలకు పాతరేసి భారత పార్లమెంట్లో రూపొందిన చట్టాలు అమల్లోకి వచ్చాయని చెప్పారు. దండనకు బదులు ఇప్పుడు న్యాయం అందుబాటులోకి వచ్చిందని వ్యాఖ్యానించారు. నూతన చట్టాల అమలుతో జాప్యాలకు చెల్లుచీటీ సాధ్యమై విచారణ వేగవంతమై సత్వర న్యాయం అందుబాటులోకి వస్తుందని అన్నారు.
గత చట్టాల హయాంలో కేవలం పోలీసుల హక్కులే కాపాడబడేవని, నూతన చట్టాల రాకతో బాధితులు, ఫిర్యాదుదారుల హక్కుల పరిరక్షణకు వెసులుబాటు ఏర్పడిందని చెప్పారు. కాగా ఈ క్రమంలో నూతన చట్టాల కింద తొలి కేసు నమోదయింది. నిందితుడిని బీహార్లోని పాట్నాకు చెందిన పంకజ్ కుమార్గా గుర్తించారు.
Read More :
JP Nadda | మహిళలకు పశ్చిమ బెంగాల్ సురక్షితం కాదు : జేపీ నడ్డా
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

