Child Falls To Death | పేరెంట్స్ కంటే ముందే నిద్ర లేచిన బాలుడు.. 8వ అంతస్తు నుంచి కిందపడి మృతి
Child Falls To Death | ఒక బాలుడు తల్లిదండ్రుల కంటే ముందే నిద్ర లేచాడు. అపార్ట్మెంట్ బిల్డింగ్ 8వ అంతస్తు నుంచి కిందపడి (Child Falls To Death) మరణించాడు.
లక్నో: ఒక బాలుడు తల్లిదండ్రుల కంటే ముందే నిద్ర లేచాడు. అపార్ట్మెంట్ బిల్డింగ్ 8వ అంతస్తు నుంచి కిందపడి (Child Falls To Death) మరణించాడు. ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో ఈ సంఘటన జరిగింది. సెక్టార్ 78లో ఉన్న హైడ్ పార్క్ సొసైటీ అపార్ట్మెంట్ కాంపెక్స్లోని ఒక బిల్డింగ్ 8వ అంతస్తులో ఒక కుటుంబం నివసిస్తున్నది. అయితే శుక్రవారం ఉదయం 5.45 గంటలకు 5 ఏళ్ల బాలుడు నిద్ర నుంచి లేచాడు. బాల్కానీలోకి వెళ్లి అక్కడి గ్రిల్ నుంచి కిందకు పడ్డాడు. బిల్డింగ్ 8వ అంతస్తు నుంచి పడి తీవ్రంగా గాయపడిన ఆ బాలుడ్ని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు డాక్టర్లు తెలిపారు.
కాగా, తమ ఐదేళ్ల కుమారుడు అప్పుడప్పుడు తమ కంటే ముందుగానే మేల్కొంటాడని తల్లిదండ్రులు పోలీసులకు తెలిపారు. నిద్ర నుంచి లేచిన తర్వాత అన్ని గదుల్లో తిరుగుతుంటాడని చెప్పారు. మరోవైపు శుక్రవారం ఉదయం కుటుంబ సభ్యుల కన్నా ముందే నిద్రలేచిన ఆ బాలుడు మొక్కల కుండీలు ఉండే బాల్కానీలోకి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత మొక్కల కుండీలపైకి ఎక్కిన ఆ చిన్నారి బాల్కానీ గ్రిల్ నుంచి కింద పడి చనిపోయినట్లు చెప్పారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- child
- Falls To Death
- Noida
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

