లక్నో: ఒక పెళ్లి వేడుకలో గుర్రం డ్యాన్స్ చేసింది. అయితే దాని వెనుక ఆడుకుంటున్న చిన్నారిని అది కాళ్లతో తన్నింది. (Dancing Horse Kicks Child) దీంతో ఆ బాలుడు అక్కడికక్కడే మరణించాడు. ఈ నేపథ్యంలో ఆ వివాహ వేడుకలో విషాదం నెలకొన్నది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఈ సంఘటన జరిగింది. జనవరి 27న రాత్రి వేళ హనుమంత్ విహార్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని ఠాకూర్ చౌక్‌లో ఒక వివాహం జరిగింది. బ్యాండ్ మేళం మ్యూజిక్కు అనుగుణంగా ఒక గుర్రం డ్యాన్స్ చేసింది.
కాగా, అక్కడ ఆడుకుంటున్న బాలుడు డ్యాన్స్ చేస్తున్న గుర్రం వెనుకకు వచ్చాడు. అయితే ఆ గుర్రం వెంటనే వెనుక కాళ్లతో ఆ చిన్నారిని తన్నింది. దీంతో అక్కడున్న గట్టుకు ఆ బాలుడి తల బలంగా తగిలింది. ఈ నేపథ్యంలో తీవ్రంగా గాయపడిన ఆ చిన్నారి అక్కడికక్కడే మరణించాడు. ఇది చూసి బాలుడి కుటుంబంతో పాటు అక్కడున్న వారు షాక్ అయ్యారు. ఈ సంఘటన వల్ల ఆ పెళ్లి వేడుకలో సంతోషం మాయమైంది.
మరోవైపు ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఈ షాకింగ్ వీడియోపై నెటిజన్లు స్పందించారు. ఇలాంటి వేడుకల్లో ప్రమాదాలు నివారించేందుకు పిల్లల పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, వారిని పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని కొందరు సూచించారు.
#कानपुर शादी में आई घोड़ी ने मासूम बच्चे को मारी लात,मासूम बच्चे की हुई मौत।
घोड़ी के पीछे से गुजर रहे मासूम बच्चे को मारी लातपड़ोस में ही लगे सीसीटीवी में कैद हुई पूरी वारदात
कानपुर के हनुमंत बिहार थाना क्षेत्र के ठाकुर चौराहे का मामला।@MohtaPraveenn pic.twitter.com/fC3ADIdyIg
— Gaurav Trivedi (@gaurav3vedi) January 27, 2025