Doctor CM | బాలుడికి సక్సెస్‌ఫుల్‌గా డెంటల్ సర్జరీ చేసిన త్రిపుర సీఎం
Doctor CM | రాజ్యాంగబద్ధమైన పదవితో విధి నిర్వహణలో బిజీబిజీగా ఉండి కూడా త్రిపుర ముఖ్యమంత్రి మానిక్ సాహా.. తీవ్రమైన పంటి సమస్యతో బాధపడుతున్న ఓ బాలుడి కోసం
హపానియా: రాజ్యాంగబద్ధమైన పదవితో విధి నిర్వహణలో బిజీబిజీగా ఉండి కూడా త్రిపుర ముఖ్యమంత్రి మానిక్ సాహా.. తీవ్రమైన పంటి సమస్యతో బాధపడుతున్న ఓ బాలుడి కోసం తన వృత్తి ధర్మం నెరవేర్చారు. తాను సీఎం కాకముందు పనిచేసిన హపానియాలోని త్రిపుర మెడికల్ కాలేజీ ఆస్పత్రికి వెళ్లి బాధిత బాలుడికి విజయవంతంగా డెంటల్ సర్జరీ నిర్వహించారు.
ఓరల్ సిస్టిక్ లీషన్ అనే పంటి సమస్యతో బాధపడుతున్న బాలుడికి సర్జరీ నిర్వహించడానికి సీఎం మానిక్ సాహా ఇవాళ ఉదయం 9 గంటలకు ఆస్పత్రికి వెళ్లారు. అప్పటికే ఆపరేషన్ థియేటర్లో సిద్ధంగా ఉన్న పేషెంట్‌కు అరగంటపాటు సర్జరీ నిర్వహించారు. ఆ తర్వాత సర్జరీని సక్సెస్ఫుల్ చేసి చిరునవ్వుతో బయటికి వచ్చారు.
ఈ సర్జరీ సందర్భంగా మానిక్ సాహాకు డాక్టర్ అమిత్లాల్ గోస్వామి, డాక్టర్ పూజా దేవ్నాథ్, డాక్టర్ రుద్రప్రసాద్ చక్రవర్తి తదితరులు సహాయకులుగా ఉన్నారు. ఆపరేషన్ అనంతరం మీడియాతో మాట్లాడిన త్రిపుర సీఎం.. తాను చాలా రోజుల తర్వాత సర్జరీ చేశానని, అయినా పెద్దగా ఇబ్బందేమీ అనిపించలేదని చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

