Chandrayaan | న్యూఢిల్లీ, మార్చి 6: చంద్రయాన్-3 చారిత్రాత్మక విజయం సాధించాక చంద్రయాన్-4 పేరుతో మరో మిషన్‌కు ఇస్రో సిద్ధమైంది. ఈ ప్రయోగం రెండు దశల్లో ఉంటుందని, ఇందుకోసం రెండు వాహక నౌకలను సిద్ధం చేస్తున్నట్టు ఇస్రో చైర్మన్ సోమనాథ్ ఇటీవల జరిగిన నేషనల్ సైన్స్ సింపోజియం కార్యక్రమంలో మాట్లాడుతూ తెలిపారు.
చంద్రునిపై నుంచి రాళ్లు, మట్టి నమూనాలను తీసుకురావటం లక్ష్యంగా పెట్టుకున్నట్టు గతంలోనే చెప్పారు. చంద్రయాన్ -4లో ప్రొపల్షన్, డిసెండర్, అసెండర్, ట్రాన్స్ఫర్, రీ ఎంట్రీ అనే ఐదు రకాల మాడ్యూల్స్ ఉంటాయన్నారు.