తిరువనంతపురం : అనుకున్న పరీక్షలన్నీ ప్రణాళిక ప్రకారం పూర్తయితే జూలై 12-19 మధ్య చంద్రయాన్-3 ప్రయోగం ఉంటుందని ఇస్రో చైర్మెన్ సోమనాథ్ వెల్లడించారు. కొత్త సాఫ్ట్‌వేర్‌ను జత చేశామని, గమ్యస్థానాన్ని చంద్రయాన్ చేరకపోయినా, మరొక స్థలంలో ల్యాండ్ అయ్యేందుకు ఇది ఉపకరిస్తుందని తెలిపారు. చంద్రయాన్‌ను ప్రయోగించే రాకెట్‌ను శ్రీహరికోటలోని ప్రయోగ వేదిక వద్దకు చేర్చామన్నారు. రాకెట్ వేగాన్ని కొలవడానికి లేజర్ డాప్లర్ వెలాసి మీటర్ ఉపయోగిస్తున్నామన్నారు.