నకిలీ టీకాలపై రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక.. ఎలా గుర్తించాలో వివరణ

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ఊపందుకోవడంతో నకిలీ టీకాలపై అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలను కేంద్రం హెచ్చరించింది. నకిలీ టీకాలను ఎలా గుర్తించాలో అన్నది వివరించింది. భారత్‌లో తయారైన కోవిషీల్డ్ వ్యాక్సిన్ నకిలీ వెర్షన్ల గురించి అంతర్జాతీయ మార్కెట్లో ప్రచారం జరుగుతున్నది. ఆగ్నేయాసియా, ఆఫ్రికా దేశాల్లో నకిలీ కోవిషీల్డ్ వ్యాక్సిన్లను సీజ్ చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా దీనిపై ఆందోళన వ్యక్తం చేయడంతోపాటు అప్రమత్తం చేసింది. భారత్‌లో కూడా నకిలీ కోవిషీల్డ్ వ్యాక్సిన్లు అమ్ముతున్నట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం దీనిపై దర్యాప్తును ప్రారంభించింది.
ఈ పరిస్థితుల నేపథ్యంలో దేశంలో వినియోగిస్తున్న కోవిడ్ వ్యాక్సిన్ల ప్రామాణికతను గుర్తించేందుకు అనుసరించాల్సిన విధానాల జాబితాను రాష్ట్రాలకు కేంద్రం శనివారం జారీ చేసింది. వ్యాక్సిన్ నకిలీదా లేదా అసలైనదా అని గుర్తించడానికి ఈ పారామితులు సహాయపడతాయని రాష్ట్ర ప్రభుత్వాలకు రాసిన లేఖలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రస్తుతం భారత మార్కెట్లో వాడుతున్న మూడు టీకాలు- కోవిషీల్డ్, కోవాక్సిన్, స్పుత్నిక్ వీ తయారీ కంపెనీల సమాచారంతో వ్యాక్సిన్ నకిలీదా లేదా అసలైనదా అని గుర్తించేందుకు సహాయపడే పారామితులను తయారు చేసినట్లు తెలిపింది. టీకా తయారీదారులు ఉపయోగించే లేబుల్, రంగు, ఇతర వివరాలను కూడా రాష్ట్రాలకు పంపిన నోట్లో వెల్లడించింది.
కాగా, దేశంలో ఈ ఏడాది జనవరి నుంచి వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం కాగా, ఇప్పటి వరకు 68 కోట్ల మంది ప్రజలు కరోనా టీకా పొందినట్లు ప్రభుత్వ గణాంకాల ద్వారా తెలుస్తున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women’s Asian Champions Trophy | చైనాపై భారత్ ఘన విజయం.. ఆసియా హాకీ ఛాంపియన్‌గా హ్యాట్రిక్
Child Marriage | టెంకంపేట్లో బాల్యవివాహానికి బ్రేక్.. అధికారుల చొరవతో నిలిపివేత
Begumpet Students | సిద్దిపేట వైజ్ఞానిక ప్రదర్శనలో బేగంపేట విద్యార్థుల ప్రతిభ.. రాష్ట్రస్థాయికి స్మార్ట్ వాకర్ ప్రాజెక్టు
Myanmar military bombs school | స్కూల్‌పై మయన్మార్ ఆర్మీ బాంబు దాడి.. మహిళలు, పిల్లలతో సహా 30 మంది మృతి
ఓబీసీ కులగణన తర్వాతే డీలిమిటేషన్ చేపట్టాలి.. బీసీ మహిళలకు సబ్‌కోటా కల్పించాలి.. జాజుల శ్రీనివాస్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

