Instagram | పిల్లలపై ఇన్‌స్టాగ్రామ్‌లో అభ్యంతరకర యాడ్స్.. మెటాకు కేంద్రం సమన్లు
Instagram : పిల్లలపై అభ్యంతరకర యాడ్స్ ప్రసారం చేస్తున్న సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఇన్‌స్టాగ్రామ్‌పై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇన్స్టాగ్రామ్ యాజమాన్య సంస్థ మెటాకు నోటీసులు జారీ చేయాలని నిర్ణయించింది. ఈ అంశంలో మెటాకు సమన్లు జారీ చేయాల్సిందిగా అధికారులను ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ శుక్రవారం ఆదేశించారు.
Instagram : పిల్లలపై అభ్యంతరకర యాడ్స్ ప్రసారం చేస్తున్న సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఇన్‌స్టాగ్రామ్‌పై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇన్స్టాగ్రామ్ యాజమాన్య సంస్థ మెటాకు నోటీసులు జారీ చేయాలని నిర్ణయించింది. ఈ అంశంలో మెటాకు సమన్లు జారీ చేయాల్సిందిగా కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార, సాంకేతిక శాఖ అధికారులను ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ శుక్రవారం ఆదేశించారు. పిల్లలపై లైంగిక వేధింపులను ప్రోత్సహించేలా ఇన్స్టాగ్రామ్ యాడ్స్ ఉన్నాయంటూ వచ్చిన ఆరోపణలపై వివరణ ఇవ్వాలని కోరుతూ మెటాకు నోటీసులు జారీ చేయాలని కేంద్రం నిర్ణయించింది.
ఈ అంశంపై బీబీసీ ఒక ప్రత్యేక కథనాన్ని ప్రచురించిన సంగతి తెలిసిందే. ఇన్స్టాగ్రామ్.. ఇండియాలో పిల్లలపై లైంగిక వేధింపుల్ని ప్రచారం చేసే సాధనంగా మారిందని బీబీసీ తన కథనంలో ఆరోపించింది. యాడ్స్ ప్రసారం చేయడమే కాకుండా, రేప్ వీడియో, చైల్డ్ వీడియో అంటూ ప్రచారం కూడా చేస్తున్నట్లు పేర్కొంది. ఈ యాడ్స్‌కు సంబంధించిన వీడియోలు టెలిగ్రామ్‌లో ప్లే అవుతున్నాయి. ఇందుకు టెలిగ్రాం యూజర్లు తమ ఫాలోవర్లకు రూ.99లకు విక్రయిస్తున్నారు. పైగా ఈ యాడ్స్.. ఇన్‌స్టాగ్రామ్‌కు చెందిన మోడరేషన్ టెక్నాలజీ ఆమోదం పొందిన తర్వాతనే ప్రసారమవుతాయని తెలిపింది. అంటే, ఉద్దేశపూర్వకంగానే ఇన్స్టాగ్రామ్ వీటిని ప్రసారం చేస్తున్నట్లు బీబీసీ వివరించింది. దీనిపై గంటల వ్యవధిలోనే కేంద్రం స్పందించింది. మెటాకు సమన్లు జారీ చేయాలని నిర్ణయించింది.
దీనిపై స్పందించిన మెటా.. కమ్యూనిటీ గైడ్‌లైన్స్ ప్రకారమే తమ ప్రకటనలు ఉన్నట్లు తెలిపింది. వారం వ్యవధిలో మెటాకు కేంద్రం నోటీసులు జారీ చేయడం ఇది రెండోసారి. మెటాకు చెందిన వాట్సాప్‌లో యూజర్ ఐడీ ఫీచర్‌కు సంబంధించి గత బుధవారం కూడా కేంద్రం నోటీసులు జారీ చేసింది. దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. మెటాతోపాటు టెలిగ్రామ్‌కు కూడా నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసులపై వాట్సాప్ స్పందించింది. యూజర్ల భద్రతకు, స్కాంలు, మోసాలకు వ్యతిరేకంగా కట్టుబడి ఉన్నామని ప్రకటించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Child abuse
- India
- Meta
RELATED ARTICLES
తాజా వార్తలు
Cyclone Akvan | ఈ నెల 11 నుంచి ‘ఆక్వాన్’ తుపాన్
Uttam Kumar Reddy| రేయ్ నోర్ముయ్.. ఎవడ్రా నువ్వు.. కాంగ్రెస్ కార్యకర్తలపై నోరు పారేసుకొన్న మంత్రి ఉత్తమ్
ప్రజల రక్షకులా? ప్రభుత్వ కవచాలా?
Revanth Reddy | సీఎం బర్త్‌డే ప్రచార ఖర్చు 150 కోట్లు?.. పత్రికల్లో ప్రకటనలు, సోషల్‌మీడియా, హోర్డింగ్‌ల కోసం భారీగా వెచ్చింపు
జీవో-31 సుప్రీం తీర్పునకు విరుద్ధం!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

