Manipur | మణిపూర్‌కు అదనపు బలగాలు.. 50 సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్ కంపెనీలు పంపనున్న కేంద్రం
Manipur | మణిపూర్‌లో మళ్లీ జాతి హింస చెలరేగుతున్నది. ఈ నేపథ్యంలో మరో 50 కంపెనీల సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్ బలగాలను పంపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం ఢిల్లీలో ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు.
ఇంఫాల్: మణిపూర్‌లో (Manipur) మళ్లీ జాతి హింస చెలరేగుతున్నది. ఈ నేపథ్యంలో మరో 50 కంపెనీల సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్ బలగాలను పంపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం ఢిల్లీలో ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. మణిపూర్‌లో శాంతిభద్రతలను సమీక్షించారు. అక్కడి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు మరో 50 కంపెనీల బలగాలను పంపాలని నిర్ణయించారు. 35 కంపెనీల సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్), 15 కంపెనీల సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) బలగాలను పంపనున్నారు.
కాగా, మణిపూర్‌లోని జిరిబామ్ జిల్లాలో చెలరేగిన హింసాకాండ ఇతర ప్రాంతాలకు విస్తరించింది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో కేంద్ర బలగాలను మోహరించడం ఇది రెండోసారి. నవంబర్ 12న కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరో 20 సీఏపీఎఫ్ (15 సీఆర్పీఎఫ్, 5 బీఎస్ఎఫ్) యూనిట్లను మణిపూర్‌కు పంపింది. దీంతో ఆ రాష్ట్రంలో ఇప్పుడు 218 కంపెనీల బలగాలున్నాయి.
మరోవైపు మైతీల మహిళలు, పిల్లలను కుకీ మిలిటెంట్లు హత్య చేయడంతో మరోసారి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో తాజాగా హింసాత్మక సంఘటనలు పెరిగాయి. ఈ నేపథ్యంలో మణిపూర్‌కు అదనంగా మరో 50 కంపెనీల బలగాలను పంపాలని కేంద్ర ప్రభుత్వం సోమవారం నిర్ణయించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IAS Transfers | రాష్ట్రంలో ఎనిమిది మంది ఐఏఎస్‌ల బదిలీ.. ప్రత్యేక అధికారిగా సర్పరాజ్ నియామకం
Railway Jobs | రైల్వేలో 191 ఐసోలేటెడ్ పోస్టులు.. డిసెంబర్ 4తో ముగియనున్న గడువు
విశాఖలో విద్యార్థుల విహారయాత్రలో ప్రమాదం.. కైలాసగిరి లోయలోకి దూసుకెళ్లిన స్కూల్ బస్సు
‘న్యాయవాద వృత్తిలో ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎంతో ముఖ్యం’
రేవంత్ రెడ్డికి మరో ఎదురుదెబ్బ.. ‘బావర్చి’ కేసులో కాంగ్రెస్ సర్కార్‌కు హైకోర్టు మొట్టికాయలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

