అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ పదవీకాలం మరో ఏడాది పొడిగింపు

న్యూఢిల్లీ: అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ పదవీకాలాన్ని మళ్లీ పొడిగించారు. బుధవారం ఆయన రిటైర్ కావాల్సి ఉంది. కానీ మరో ఏడాది పాటు అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్‌కు బాధ్యతల్ని పొడిగిస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన వయసు 90 ఏళ్లు. జూన్ 2017లో మాజీ అటార్నీ జనరల్ ముఖుల్ రోహత్గీ వ్యక్తిగత కారణాలతో రిజైన చేసిన తర్వాత ఆ బాధ్యతలను వేణుగోపాల్‌కు అప్పగించారు. మూడేళ్ల పదవీకాలం కోసం జూలై 1, 2017లో ఆయన్ను నియమించారు. అయితే గత ఏడాది కూడా ఆయన పదవీకాలాన్ని ఏడాది పాటు పొడిగించారు. భారత దేశ 15వ అటార్నీ జనరల్‌గా ఏజీ వేణుగోపాల్ నియమితులైన విషయం తెలిసిందే. 2019లో మోదీ ప్రభుత్వం రెండవసారి గెలిచిన తర్వాత కూడా ఆయన ఆ పదవిలో కొనసాగుతున్నారు. మొరార్జీ దేశాయ్ ప్రభుత్వ హయాంలో అదనపు సొలిసిటర్ జనరల్‌గా ఆయన బాధ్యతలు నిర్వర్తించారు. కొత్త ఆదేశాల ప్రకారం.. వచ్చే ఏడాది జూన్ 30వ తేదీ వరకు కేకే వేణుగోపాల్ అటార్నీ జనరల్‌గా కొనసాగుతారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

