అగ్నివీరులకు మరో రెండేండ్ల సర్వీసు పొడిగింపు
అగ్నివీరులకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చింది. నాలుగేండ్ల సర్వీసు పూర్తయిన తర్వాత సాధారణ సైనిక దళాల్లోకి ఎంపికకాని అగ్నివీరుల్లో 75 శాతం మందికి మరో రెండేండ్ల సర్వీసును పొడిగించనున్నట్లు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) జనరల్ ఎస్ఎస్ రాజా సుబ్రమణి ప్రకటించారు.
న్యూఢిల్లీ: అగ్నివీరులకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చింది. నాలుగేండ్ల సర్వీసు పూర్తయిన తర్వాత సాధారణ సైనిక దళాల్లోకి ఎంపికకాని అగ్నివీరుల్లో 75 శాతం మందికి మరో రెండేండ్ల సర్వీసును పొడిగించనున్నట్లు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) జనరల్ ఎస్ఎస్ రాజా సుబ్రమణి ప్రకటించారు. దీంతో వారి సర్వీసు మొత్తం కాలం ఆరేండ్లకు చేరనుంది. అదనపు రెండేండ్ల తర్వాత మరోసారి సాధారణ సైనిక దళాల్లో చేరేందుకు ఎంపిక ప్రక్రియలో అవకాశం కల్పిస్తారు.
అయితే పనితీరు, ప్రతిభ ఆధారంగానే తుది ఎంపిక ఉంటుందని స్పష్టం చేశారు. సాయుధ దళాల ప్రతిపాదనకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. విద్యార్హతలను పదో తరగతి నుండి డిగ్రీ వరకు పెంచుకునే అవకాశాలపైనా దృష్టి పెట్టినట్లు తెలిపారు. 2022లో ప్రారంభమైన అగ్నిపథ్ పథకం కింద తొలి బ్యాచ్ సర్వీసు నవంబర్ 21 నుంచి డిసెంబర్ 31 మధ్య ముగియనుంది. ఈ బ్యాచ్లో 18 వేల మందికిపైగా అగ్నివీరులు నాలుగేండ్ల సర్వీసు పూర్తి చేయనున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

