CIC | అది చట్టాన్ని ఉల్లంఘించడమే.. రాతపూర్వక వివరణ ఇవ్వండి.. ఈసీకి సీఐసీ ఆదేశం
ఈవీఎంలపై ఆర్టీఐ కింద సమాచారం ఇచ్చేందుకు ఎన్నికల సంఘం నిరారించడంపై కేంద్ర సమాచా ర కమిషన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
- ఈవీఎంలపై ఆర్టీఐ దరఖాస్తుకు ఎందుకు జవాబివ్వలేదు?
CIC | న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: ఈవీఎంలపై ఆర్టీఐ కింద సమాచారం ఇచ్చేందుకు ఎన్నికల సంఘం నిరారించడంపై కేంద్ర సమాచా ర కమిషన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిం ది. ఇది చట్టాన్ని ఉల్లంఘించడమేనంటూ ఈసీ తీరును తప్పుబట్టింది. దీనిపై వివరణ ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘానికి సీఐసీ తాజాగా ఆదేశాలు జారీచేసింది. రెండేండ్ల క్రితానికి సంబంధించిన ఈ కేసు రికార్డులు, వాదనలను పరిశీలించిన తర్వాత.. ఓ ఆర్టీఐ దరఖాస్తు కింద చట్టప్రకారం 30 రోజుల్లోగా స్పందించకుం డా నిబంధనలను ఉల్లంఘించినందుకు రాతపూర్వక వివరణ ఇవ్వాలని ఇప్పటి ఈసీ సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారి ద్వారా అప్పటి పీఐవోను ఆదేశించినట్టు కేంద్ర సమాచార కమిషనర్ హీరాలాల్ సమారియా తెలిపారు. ఈ ఉల్లంఘనకు ఇంకెవరైనా బాధ్యులు ఉంటే వారికి కూ డా తమ ఆదేశాల కాపీని అందజేయాల ని, వారు కూడా సీఐసీకి సమాధానం ఇ చ్చేలా చూడాలని సీపీఐవోను సీఐసీ ఆదేశించారు. ఎన్నికల సమయంలో ఉపయోగించే ఈవీఎంలు, వీవీప్యాట్ మిషన్ల విశ్వసనీయతపై పలు ప్రశ్నలు లేవనెత్తు తూ పలువురు మాజీ సివిల్ సర్వెంట్లు, ఐఐటీ, ఐఎంఎంల ప్రొఫెసర్లు, టెక్ నిపుణులు, విద్యావేత్తలు 2022, మే 2న ఈసీకి లేఖ రాశారు. కాగా, ఈ రిప్రజంటేషన్పై ఏం చర్యలు తీసుకొన్నారో తెలుపాలని కోరుతూ మాజీ ఐఏఎస్ ఎంజీ దేవ సహాయం ఆర్టీఐ కింద అదే ఏడాది నవంబర్ 22న దరఖాస్తు చేశారు.
అప్పీల్‌ను పట్టించుకోని ఈసీ అధికారులు
తమ రిప్రజంటేషన్ను ఎవరికి పంపా రు? తాము లేవనెత్తిన అంశంపై సమావేశాల్లో చర్చించారా? తదితర వివరాలను తెలియజేయాలని కోరుతూ దేవసహా యం ఆర్టీఐ కింద దరఖాస్తు చేశారు. అ యితే 30 రోజుల తప్పనిసరి పీరియడ్‌లో గా ఈసీ నుంచి ఆయనకు సమాధానం రాలేదు. దీంతో దేవసహాయం చేసిన మొ దటి అప్పీల్‌ను ఈసీ సీనియర్ అధికారు లు పట్టించుకోలేదు. ఆ తర్వాత ఎన్నికల సంఘం నుంచి సమాధానం రాకపోవడంతో ఆయన సెకండ్ అప్పీల్ కోసం కేం ద్ర సమాచార కమిషన్‌ను ఆశ్రయించా రు. దేవసహాయం దరఖాస్తుకు ఎందుకు స్పందించలేదని సీఐసీ హీరాలాల్ సమారియా అడుగ్గా.. ఈసీ సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారి(సీపీఐవో) నుంచి సంతృప్తికర సమాధానం రాలేదు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

