నకిలీ టీకాలపై నజర్

- ఫేక్ వ్యాక్సిన్లపై డబ్ల్యూహెచ్‌వో ఆందోళన
- రాష్ర్టాలను అప్రమత్తం చేసిన కేంద్ర ప్రభుత్వం
- టీకాలు నిజమైనవా, నకిలీవా గుర్తించడంపై సూచనలు
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 5: కరోనా నకిటీ టీకాలపై రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం అప్రమత్తం చేసింది. వ్యాక్సినేషన్లో భాగంగా ప్రస్తుతం ప్రజలకు ఇస్తున్న కొవిషీల్డ్, కొవాగ్జిన్, స్పుత్నిక్ వీ టీకాల్లో ఏవి అసలైనవి? ఏవి నకిలీవి? అన్నది గుర్తించడానికి మార్గదర్శకాలు జారీచేసింది. ఆగ్నేయాసియా, ఆఫ్రికా దేశాల్లో నకిలీ టీకాలు వినియోగిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తంచేసింది. భారత్‌లోనూ నకిలీ కొవిషీల్డ్ టీకాలు ఇస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో టీకా తయారీదారులు ఇచ్చిన సమాచారం ఆధారంగా కేంద్రం మార్గదర్శకాలను విడుదల చేసింది.
నిజమైన టీకాలు ఎలా ఉంటాయంటే?
కొవిషీల్డ్
- టీకా వయల్‌పై ఆకుపచ్చ రంగు (ప్యాంటోన్ 355సీ) కవర్ ఉంటుంది. దానిపై ఎస్ఐఐ లోగో కనిపిస్తుంది.
- సీసా మూతపై ముదురు ఆకుపచ్చ అల్యూమినియం ఫ్లిప్ సీల్ ఉంటుంది.
- ఆకుపచ్చ అక్షరాలతో తెల్లని లేబుల్‌పై కొవిషీల్డ్ అనే ట్రేడ్‌మార్క్ రాసి ఉంటుంది. వ్యాక్సిన్ జనరిక్ పేరు సన్నటి అక్షరాలతో ఉంటుంది.
- లేబుల్‌పై ‘సీజీఎస్ నాట్ ఫర్ సేల్’ అనే ఇంగ్లిష్ అక్షరాలు ఎరుపు రంగుతో అడ్డంగా ప్రింట్ చేస్తారు.
- తేనెతుట్టె గూళ్ల మాదిరిని పోలిన డిజైన్‌ను సీసాపై అక్కడక్కడ వేస్తారు. మామూలుగా ఇది కనిపించదు. లోతుగా పరీక్షిస్తేనే తెలుస్తుంది.
కొవాగ్జిన్
- డీఎన్ఏ నిర్మాణాన్ని పోలిన యూవీ హెలిక్స్ డిజైన్ వయల్ లేబుల్‌పై ఉంటుంది. యూవీ కాంతితో మాత్రమే దీన్ని గుర్తించగలం.
- లేబుల్‌పై కనిపించని చిన్నచిన్న మైక్రో బిందువులు ‘కొవాగ్జిన్’ పేరుతో ఉంటాయి.
- లేబుల్‌పై లేత సముద్రపు నీలిరంగులో ‘కొవాగ్జిన్’ పేరు పెద్దగా ఉంటుంది. పేరులోని ‘ఎక్స్’ అక్షరంలో ఆకుపచ్చ రంగు కూడా మిళితమై ఉంటుంది.
- కొవాగ్జిన్’ పేరుపై హోలోగ్రాఫిక్ ఎఫెక్ట్ ఉంటుంది.
స్పుత్నిక్ వీ
- 2 రకాల లేబుల్స్‌తో ‘స్పుత్నిక్ వీ’ వయల్స్ ఉంటాయి.
- టీకా సమాచారం, డిజైన్ అంతా ఒకేలా ఉన్నప్పటికీ, తయారీదారు పేర్లు వేర్వేరుగా ఉంటాయి. అక్షరాలన్నీ రష్యా భాషలో ఉంటాయి.
- ఐదు వయల్స్ కలిగిన ఒక్కో కార్టన్ ప్యాక్‌పై ముందు, వెనుక ఇంగ్లిష్ అక్షరాలతో లేబుల్స్ రాస్తారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Iran | బాలిస్టిక్ మిస్సైల్స్‌పై పరిమితిని ఎత్తేశాం.. ఇరాన్ కీలక ప్రకటన..!
Agriculture Student | మీరు ప్రొఫెసర్లా.. ప్రొఫెసర్ల ముసుగులో ఉన్న బ్రోకర్లా..? : అగ్రికల్చర్ వర్సిటీ విద్యార్థి ఫైర్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

