Medicines | ఇక మందులూ మాట్లాడుతాయ్.. ఔషధాల లేబులింగ్‌లో కేంద్రం భారీ ప్రక్షాళన
Medicines | ఔషధాలపై రోగులలో మరింత విశ్వాసాన్ని పెంచేందుకు ఔషధాల ప్యాకేజింగ్‌కు సంబంధించి భారీ ప్రక్షాళన చేపట్టనున్నది. ఇందులో భాగంగా ఇక ఔషధాల లేబుళ్లపై ఉండే క్యూఆర్ కోడ్లు మాటల రూపంలో కూడా వినడంతోపాటు బ్రెయిలీ కార్డులు, మరింత స్పష్టంగా కనిపించే లేబుళ్లను ప్రవేశపెట్టాలని కేంద్రం యోచిస్తున్నది.
- ప్యాకేజింగ్‌లో వాయిస్ అసిస్టెన్స్‌తో కూడిన క్యూఆర్ కోడ్లు చేర్పు
- అంధుల కోసం బ్రెయిలీ కార్డులు
Medicines | న్యూఢిల్లీ : ఔషధాలపై రోగులలో మరింత విశ్వాసాన్ని పెంచేందుకు ఔషధాల ప్యాకేజింగ్‌కు సంబంధించి భారీ ప్రక్షాళన చేపట్టనున్నది. ఇందులో భాగంగా ఇక ఔషధాల లేబుళ్లపై ఉండే క్యూఆర్ కోడ్లు మాటల రూపంలో కూడా వినడంతోపాటు బ్రెయిలీ కార్డులు, మరింత స్పష్టంగా కనిపించే లేబుళ్లను ప్రవేశపెట్టాలని కేంద్రం యోచిస్తున్నది. ఔషధాల లేబుళ్ల గురించి వినియోగదారుల ఫిర్యాదులను పరిష్కరించి చూపులేని వారికి కూడా ఔషధాల ప్యాకేజింగ్‌పై పూర్తి అవగాహన కలిగే విధంగా ఔషధ నియంత్రణ సంస్థ సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్(సీడీఎస్సీఓ) ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు న్యూస్ 18 ఓ కథనాన్ని ప్రచురించింది. డ్రగ్ కన్సల్టేటివ్ కమిటీ(డీసీసీ) ఇచ్చే సిఫార్సులను పురస్కరించుకుని ప్యాకేజింగ్‌కి సంబంధించిన సమస్యలను సమగ్రంగా పరిశీలించేందుకు ఓ ఉప కమిటీని సీడీఎస్సీఓ ఏర్పాటు చేస్తుంది.
ఔషధ ఉత్పత్తులకు లేబులింగ్‌పై ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించిన డీసీసీ వివిధ రాష్ర్టాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కమిటీ సిఫార్సులను పంపించనున్నది. సులభంగా చిరిగిపోయే పేపర్‌పైన ముద్రిస్తున్న ఎక్స్పైరీ తేదీలు, లేబుళ్లపై ముద్రిస్తున్న అక్షరాలు మరీ చిన్నవిగా, చదవడానికి వీల్లేని విధంగా ఉండడం వంటి ఫిర్యాదులను ప్రభుత్వం డీసీసీ దృష్టికి తీసుకువెళ్లింది. జూన్ 17న జరిగిన సమావేశంలో డీసీసీ దృష్టికి వచ్చిన ఫిర్యాదులలో మెడిసిన్ పేర్లను ఒకే చోట ముద్రించడం, బ్రాండెడ్ ఔషధాల నుంచి జనరిక్ ఔషధాలు ప్రత్యేకంగా కనపడేందుకు వీలుగా ఒకే సింబల్ ఉండేలా చూడడం వంటివి ఉన్నాయి. వినియోగదారుల నుంచి వచ్చిన అన్ని ఫిర్యాదులను కమిటీ సవివరంగా చర్చిస్తుందని ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. చూపులేని వినియోగదారుల కోసం బ్రెయిలీ కార్డులను చేర్చడం, వాయిస్ అసిస్టెన్స్‌తో కూడిన క్యూర్ కోడ్లను ప్యాకేజింగ్‌లో చేర్చడం వంటివి కూడా డీసీసీ పరిశీలనలో ఉన్నట్లు ఆ అధికారి చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

