న్యూఢిల్లీ: ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్ కుమార్, కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్ అధికారుల రెండు రోజుల ఛత్తీస్‌గఢ్ పర్యటన ‘అనివార్య కారణాల’ వల్ల వాయిదా పడింది. ఈ పర్యటన అక్టోబర్ 7,8 తేదీల్లో జరగాల్సి ఉండగా, కొత్త తేదీలను కమిషన్ నుంచి సమాచారం అందిన వెంటనే ప్రకటిస్తామని ఛత్తీస్‌గఢ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా దంతేవాడలోని దంతేశ్వరి మాత ఆలయం, బస్తర్‌లోని చిత్రకూట్ జలపాతం వంటి పర్యాటక ప్రాంతాలను కూడా జ్ఞానేశ్ కుమార్ సందర్శించాల్సి ఉంది. సర్ ప్రక్రియలో ఓటు చోరీ జరిగిందనే ఆరోపణలతో ప్రతిపక్షాలు చేపట్టిన భారీ నిరసనల నేపథ్యంలో ఈ పర్యటన వాయిదా నిర్ణయం వెలువడింది. గత వారంలోనూ జ్ఞానేశ్ కుమార్ యూపీ పర్యటనను వాయిదా వేసుకున్నారు.