అజేయ యోధుడికి అల్విదా.. బిపిన్ రావత్ అంత్యక్రియలు పూర్తి

న్యూఢిల్లీ: దేశభక్తి.. దేశసేవ.. ఆయన ఆలోచన. సైన్యం ఆధునీకరణ ఆయన ఆశయం. కర్తవ నిర్వహణలోనే ఆయన చివరకు కన్నుమూసిన సీడీఎస్ చీఫ్ బిపిన్ రావత్‌కు ఆశ్రు నాయనాల మధ్య ఇవాళ అంతిమ వీడ్కోలు పలికారు. భారత ఆర్మీని ప్రొఫెషన్ ఆర్మీగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నించిన రావత్‌కు విషన్నవదనాలతో గుడ్‌బై పలికారు. రణనీతిలో తన అనన్యసామాన్య కౌశలాన్ని ప్రదర్శించిన బిపిన్ ఎప్పటికీ గుర్తుండిపోతారు. కేవలం సైన్యాధికారి రూపంలో మాత్రమే కాదు.. వ్యక్తి రూపంలో ఆయన అందర్నీ ఆకట్టుకున్నారు. దేశభక్తి, పరాక్రమం, వీరత్వం, సాహస గుణాలతో అందర్నీ మెప్పించారు. అజేయ యోధుడిగా అమరుడయ్యారు. దేశానికి ప్రేరకుడిగా నిలిచిన జనరల్ రావత్‌కు ఇవాళ ఢిల్లీలోని బారర్ స్క్వేర్‌లో ఘనంగా సైనిక రీతిలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు.

గన్ సెల్యూట్..
సైనిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో 17 గన్ సెల్యూట్ చేశారు. అంతకముందు ఆయన ఆత్మకుశాంతి చేకూర్చాలని విదేశీ అంబాసిడర్లు, ఆర్మీ నాయకులు ప్రార్థించారు. పుష్ప గుచ్ఛాలు అర్పించారు. శ్రీలంక, భూటాన్, నేపాల్, బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్‌లు హాజరయ్యారు. 800 మంది త్రివిధ దళాల సైనికులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

దహన సంస్కారాలు నిర్వహించిన కుమార్తెలు..
రావత్ దంపతుల దహన సంస్కారాలకు భారీ సంఖ్యలో విదేశీ అతిథులు హాజరయ్యారు. హిందూ వైదిక ధర్మం ప్రకారం అంతిమ సంస్కారాలు నిర్వహించారు. రావత్ ఇద్దరు కుమార్తెలు కృతిక, తరణిలు ఆ పూజల్లో పాల్గొన్నారు. బిపిన్ రావత్, మధులికా రావత్ దంపతుల పార్డీవదేహాలను ఒకే చితిపై పెట్టారు. సాంప్రదాయం ప్రకారం రావత్ కుమార్తెలు దహన ధర్మాలు చేప్టటారు. ఇద్దరు కుమార్తెలు రావత్ దంపతుల చితికి నిప్పు అంటించారు. బుధవారం జరిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో బిపిన్ రావత్ దంపతులు మృతి చెందిన విషయం తెలిసిందే.



Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

