Watch: 20 అంతస్తుల బిల్డింగ్ గ్రిల్స్ మధ్య ఇరుక్కున్న పిల్లి.. ఎలా కాపాడారంటే?
Cat stuck between grills | సుమారు 20 అంతస్తుల ఎత్తైన బిల్డింగ్ గ్రిల్స్ మధ్య ఒక పిల్లి ఇరుక్కుపోయింది. 12 గంటలపాటు అక్కడ ఉండిపోయింది. గమనించిన బిల్డింగ్ నివాసితులు బ్లూ క్రాస్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో తాళ్ల సహాయంతో అతికష్టంతో గ్రిల్స్ వద్దకు చేరుకున్న సిబ్బంది ఆ పిల్లిని కాపాడారు.
చెన్నై: సుమారు 20 అంతస్తుల ఎత్తైన బిల్డింగ్ గ్రిల్స్ మధ్య ఒక పిల్లి ఇరుక్కుపోయింది. (Cat stuck between grills) 12 గంటలపాటు అక్కడ ఉండిపోయింది. గమనించిన బిల్డింగ్ నివాసితులు బ్లూ క్రాస్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో తాళ్ల సహాయంతో అతికష్టంతో గ్రిల్స్ వద్దకు చేరుకున్న సిబ్బంది ఆ పిల్లిని కాపాడారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తమిళనాడు రాజధాని చెన్నైలో ఈ సంఘటన జరిగింది. 20 అంతస్తుల భవనంలోని గ్రిల్స్ మధ్య పిల్లి చిక్కుకోవడాన్ని నివాసితులు గమనించారు. 12 గంటలకుపైగా అక్కడి నుంచి అది కదలకపోడంతో చలించిపోయారు. ఫైర్ డిపార్ట్‌మెంట్‌తోపాటు బ్లూ క్రాస్‌కు సమాచారం ఇచ్చారు.
కాగా, బ్లూ క్రాస్ సభ్యులు అక్కడకు చేరుకున్నారు. పిల్లి చిక్కుకున్న గ్రిల్స్ వద్దకు చేరుకోవడం కష్టంగా భావించారు. ఒక వ్యక్తి ట్రెరస్ పైనుంచి తాళ్ల సహాయంతో ఇరుకుగా ఉన్న ఆ చోటుకు అతికష్టం మీద చేరుకున్నాడు. గ్రిల్స్ మధ్య చిక్కుకున్న ఆ పిల్లిని అక్కడి నుంచి కాపాడాడు.
మరోవైపు పిల్లిని రక్షించిన వీడియో క్లిప్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో బ్లూ క్రాస్ పోస్ట్ చేసింది. సవాల్‌తో కూడిన ఈ ఆపరేషన్ విజయవంతమైందని అందులో పేర్కొంది. దీంతో ఆ సంస్థ సేవలను నెటిజన్లు ప్రశంసించారు. అయితే వీడియో క్లిప్ చూసిన కొందరు ఆ పిల్లి చనిపోయిందని అభిప్రాయపడ్డారు.
కాగా, బ్లూ క్రాస్ సంస్థ దీనిపై వెంటనే స్పందించింది. పిల్లిని గ్రిల్స్ నుంచి సురక్షితంగా రక్షించడం కోసం, అది జారి కింద పడకుండా ఉండేందుకు, రక్షించే వ్యక్తిని కొరకడాన్ని నివారించేందుకు, అతడికి ఎలాంటి ప్రమాదం జరుగకుండా చూసేందుకు ఆ పిల్లికి మత్తు ఇచ్చినట్లు వివరించింది. మత్తు దిగి కోలుకున్న తర్వాత ఆ పిల్లిని ఆ ప్రాంతంలో విడిచిపెడతామని వెల్లడించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్‌లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
Akka Teaser | ‘అక్క’ టీజర్‌తో ఆసక్తి రేపుతున్న కీర్తి సురేశ్.. రాధికా ఆప్టేతో హోరాహోరీ పోరు!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

