Amarinder Singh: పంజాబ్‌లో అమరీందర్‌కు ఉద్వాసన.. ఈ సాయంత్రం సీఎల్పీ భేటీ..!
Amarinder Singh: పంజాబ్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు తారాస్థాయికి చేరుకున్నాయి. ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్‌సింగ్, పీసీసీ చీఫ్ నవజ్యోత్‌సింగ్ సిద్ధూ మధ్య పచ్చగడ్డి వేస్తే

న్యూఢిల్లీ: పంజాబ్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు తారాస్థాయికి చేరుకున్నాయి. ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్‌సింగ్, పీసీసీ చీఫ్ నవజ్యోత్‌సింగ్ సిద్ధూ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం 5.00 గంటలకు సీఎల్పీ సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు పంజాబ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి హరీష్ రావత్ తెలిపారు. పలువురు పంజాబ్ ఎమ్మెల్యేల అభ్యర్థన మేరకు ఏఐసీసీ ఇవాళ సీఎల్పీ సమావేశం ఏర్పాటుకు నిర్ణయం తీసుకుందని ఆయన ట్వీట్ చేశారు.
అయితే, సీఎల్పీ అత్యవసర సమావేశం నిర్ణయంపై ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ అసహనం వ్యక్తంచేశారు. ఇలాంటి అవమానకరమైన పరిస్థితుల్లో తాను పార్టీలో కొనసాగలేనని వ్యాఖ్యానించినట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. సీఎల్పీ భేటీ నేపథ్యంలో అమరీందర్ సింగ్ ఈ ఉదయమే తన సన్నిహితులైన ఎమ్మెల్యేలతో తన ఇంట్లో సమావేశమయ్యారు. ఈ క్రమంలో సాయంత్రం జరుగబోయే సీఎల్పీ భేటీలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకోనున్నాయనేది చర్చనీయాంశంగా మారింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

