Khalistani Terror Groups | రెండు టెర్రర్ గ్రూపులకు మా దేశం నుంచే నిధులు : కెనడా నివేదిక
Khalistani Terror Groups | కెనడా (Canada) దేశాన్ని వేదికగా చేసుకుని ఖలిస్థానీ ఉగ్రవాదులు (Khalistani Extremists) భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు మన దేశం అనేక సందర్భాల్లో ఆరోపించింది. ఆ ఆరోపణలను కెనడా పలు సందర్భాల్లో తోసిపుచ్చింది. ఈ క్రమంలోనే కెనడా ప్రభుత్వం (Canada govt) ‘టెర్రర్ ఫైనాన్సింగ్’ పై తాజాగా ఓ నివేదిక విడుదల చేసింది.
Khalistani Terror Groups : కెనడా (Canada) దేశాన్ని వేదికగా చేసుకుని ఖలిస్థానీ ఉగ్రవాదులు (Khalistani Extremists) భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు మన దేశం అనేక సందర్భాల్లో ఆరోపించింది. ఆ ఆరోపణలను కెనడా పలు సందర్భాల్లో తోసిపుచ్చింది. ఈ క్రమంలోనే కెనడా ప్రభుత్వం (Canada govt) ‘టెర్రర్ ఫైనాన్సింగ్’ పై తాజాగా ఓ నివేదిక విడుదల చేసింది. రెండు ఖలిస్థానీ ఉగ్ర సంస్థలకు తమ దేశం నుంచే నిధులు అందాయని ఆ నివేదికలో తెలిపింది.
ఆ రెండు ఉగ్ర గ్రూపులు ‘బబ్బర్ ఖాల్సా ఇంటర్నేషనల్’, ‘ఇంటర్నేషనల్ సిఖ్ యూత్ ఫెడరేషన్’ గా పేర్కొంది. ‘2025 అసెస్మెంట్ ఆఫ్ మనీలాండరింగ్ అండ్ టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ రిస్క్స్ ఇన్ కెనడా’ పేరిట అక్కడి ప్రభుత్వం ఈ నివేదికను రూపొందించింది. ‘రాజకీయ ప్రేరేపిత హింసాత్మక తీవ్రవాదం (PMVE) కేటగిరీలో ఉన్న హమాస్, హెజ్బొల్లా, ఖలిస్థానీ వంటి ఉగ్ర సంస్థలకు కెనడా నుంచే నిధులు సమకూరుతున్నట్లు అధికారులు గుర్తించారు. భారత్లోని పంజాబ్లో స్వతంత్ర దేశస్థాపన కోసం హింసాత్మక మార్గాలకు మద్దతు ఇచ్చే ఖలిస్థానీ ఉగ్రమూకలు కెనడా సహా అనేక దేశాల్లో నిధులు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. వీటికి గతంలో కెనడాలో విస్తృతమైన నిధుల సేకరణ నెట్వర్క్ ఉండేది. కానీ ఇప్పుడు ఖలిస్థానీవాదానికి తోడ్పాటునందించే వ్యక్తులే ఆర్థిక సాయం చేస్తున్నట్లు తెలుస్తోంది’ అని నివేదిక పేర్కొంది.
‘హమాస్, హెజ్బొల్లాలు నిధుల కోసం ఛారిటబుల్ ట్రస్టులు, స్వచ్ఛంద సంస్థలను దుర్వినియోగం చేయడాన్ని ప్రధాన మార్గంగా ఎంచుకుంటాయి. ఖలిస్థానీ మూకలు సైతం స్వచ్ఛంద సంస్థలతోపాటు తమ నెట్వర్క్ ద్వారా నిధుల సేకరణ, తరలింపు చేపట్టాయి. అయితే, ఈ మార్గాల ద్వారా సమకూరే నగదు అంతంత మాత్రమే. మాదకద్రవ్యాల అక్రమ రవాణా అనేది కెనడాకు అతిపెద్ద మనీలాండరింగ్ ముప్పుగా ఉంది’ అని నివేదిక తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

