Student Visas: స్టూడెంట్ వీసాలను తగ్గించిన కెనడా..
Student Visas: స్టూడెంట్ వీసాలను కెనడా తగ్గించింది. ఈ ఏడాది 35 శాతం కోత విధించింది. ఈ ఏడాది కేవలం 3,64,000 మందికి స్టూడెంట్ వీసాలు ఇవ్వనున్నారు. గత ఏడాది 5,60,000 మంది విద్యార్థులకు వీసా జారీ చేశారు.
టొరంటో: కెనడా కీలక ప్రకటన చేసింది. అంతర్జాతీయ విద్యార్థులకు ఇచ్చే వీసా(Student Visas)ల్లో కోత విధించినట్లు చెప్పింది. హౌజింగ్, హెల్త్‌కేర్‌పై ప్రభావం పడుతున్న నేపథ్యలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. రికార్డు స్థాయిలో ఇమ్మిగ్రేషన్ జరుగుతున్న సందర్భంలో ఆ దేశం ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఇమ్మిగ్రేషన్ శాఖ మంత్రి మార్క్ మిల్లర్ ఈ అంశంపై స్పందించారు. 2024లో స్టూడెంట్ వీసాల్లో 35 శాతం కోత ఉంటుందన్నారు. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ప్రోగ్రామ్‌లో తీవ్ర స్థాయి ఫ్రాడ్ జరుగుతోందని, దీంతో హౌజింగ్, హెల్త్‌కేర్ రంగాలపై ప్రభావం పడుతున్నట్లు వెల్లడించారు. ఈ ఏడాది కేవలం 3,64,000 మందికి స్టూడెంట్ వీసాలు ఇవ్వనున్నారు. గత ఏడాది 5,60,000 మంది విద్యార్థులకు వీసా జారీ చేశారు.
దేశంలో సుమారు పది లక్షల మంది విదేశీ విద్యార్థులు ఉన్నారని కెనడా ప్రభుత్వం తెలిపింది. పదేళ్ల క్రితం ఉన్న విద్యార్థుల సంఖ్య కన్నా ఇప్పుడు మూడు రెట్లు ఎక్కువ ఉన్నట్లు ప్రభుత్వం పేర్కొన్నది. క్రమక్రమంగా విద్యార్థుల ఎంట్రీపై ఆంక్షలను కఠినతరం చేయనున్నట్లు మంత్రి మిల్లర్ వెల్లడించారు. కెనడాలో గత ఏడాది జనాభాలో కొత్తగా పది లక్షల మంది కలిశారు. దీంతో కెనడా జనాబా దాదాపు 4 కోట్లకు చేరుకున్నది. ఇక జనాభా పెరగడంతో ఖర్చులు, కిరాయిలు పెరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. వీసాలపై కెనడా తీసుకున్న నిర్ణయం భారతీయ విద్యార్థులపై ప్రభావం చూపనున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Katrina Kaif | దీపావళికి కత్రినా కైఫ్ స్పెషల్ గిఫ్ట్.. తొలిసారి కొడుకు విహాన్ ఫొటో షేర్ చేసిన స్టార్ కపుల్!
Road accident | గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. రైలింగ్‌ను ఢీకొట్టిన కారు, ఐదుగురికి గాయాలు
BJP MLA: బాణాసంచా పేల్చితే.. అనేక వ్యాధులు దూరం : బీజేపీ ఎమ్మెల్యే
Yadagirigutta | యాదగిరిగుట్టలో వైభవంగా స్వాతి నక్షత్ర వేడుకలు
AK 47 Collections | భారీ నష్టాల దిశగా వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’.. 10 రోజుల కలెక్షన్లు ఎంతంటే?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

