కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా పదవీకాలం పొడిగింపు

ఢిల్లీ : కేంద్ర మంత్రివర్గ కార్యదర్శి రాజీవ్ గౌబా పదవీకాలాన్ని మోదీ ప్రభుత్వం ఏడాది కాలం పాటు పొడిగించింది. రాజీవ్ గౌబా 2019లో కేంద్ర కేబినెట్ కార్యదర్శిగా నియమితులయ్యారు. 30 ఆగస్టు,2021తో ఆయన పదవీ కాలం ముగుస్తుంది. కాగా తాజా పొడిగింపుతో రాజీవ్ గౌబా 30 ఆగస్టు,2022 వరకు పదవీలో కొనసాగనున్నారు.
1982 జార్ఖండ్ ఐఏఎస్ క్యాడర్‌కు చెందిన రాజీవ్ గౌబా గతంలో హోం సెక్రటరీగా ఉన్నారు. కేంద్రంలో పట్టణ వ్యవహారాలు, హౌసింగ్ కార్యదర్శిగా కూడా పనిచేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదించిన అనంతరం డీవోపీటీ గౌబా పదవీకాలాన్ని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

