cab driver stabs girlfriend | పెళ్లి ప్రతిపాదన తిరస్కరించినందుకు.. ప్రియురాలిని కత్తితో పొడిచి చంపిన క్యాబ్ డ్రైవర్
cab driver stabs girlfriend | పెళ్లి ప్రతిపాదన తిరస్కరించినందుకు క్యాబ్ డ్రైవర్ అయిన వ్యక్తి ఆగ్రహంతో రగిలిపోయాడు. ప్రియురాలిని కత్తితో పొడిచి చంపాడు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు.
బెంగళూరు: పెళ్లి ప్రతిపాదన తిరస్కరించినందుకు క్యాబ్ డ్రైవర్ అయిన వ్యక్తి ఆగ్రహంతో రగిలిపోయాడు. ప్రియురాలిని కత్తితో పొడిచి చంపాడు. (cab driver stabs girlfriend) ఆ తర్వాత పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. 35 ఏళ్ల గిరీష్ బెంగళూరులోని జయనగర్‌లో నివసిస్తున్నాడు. క్యాబ్ డ్రైవర్ అయిన అతడు 2011లో చెల్లికి పెళ్లి సంబంధాలు కుదరని ఇబ్బందుల వల్ల ఇస్లాం మతంలోకి మారడంతోపాటు పేరును కూడా మార్చుకున్నాడు. ప్రస్తుతం ఇస్లాం మతాచారాలు పాటిస్తున్నప్పటికీ తన పేరును తిరిగి గిరీష్‌గా మార్చుకున్నాడు.
కాగా, పశ్చిమ బెంగాల్‌కు చెందిన 42 ఏళ్ల ఫరీదా ఖాతున్, బెంగళూరులోని స్పా సెంటర్లో పని చేస్తున్నది. ఆమెకు, గిరీష్ మధ్య పదేళ్ల నుంచి పరిచయం ఉంది. మార్చి 26న ఫరీదా తన కుమార్తెలతో కలిసి బెంగాల్ నుంచి బెంగళూరుకు తిరిగి వచ్చింది. మార్చి 29న గిరీష్ పుట్టిన రోజును కలిసి జరుపుకోవడంతో పాటు తన కుమార్తెను కాలేజీలో చేర్పించాలని భావించింది.
మరోవైపు మార్చి 29న ఫరీదా, ఆమె కుమార్తెలను షాపింగ్‌కు గిరీష్ తీసుకెళ్లాడు. కలిసి భోజనం చేసిన తర్వాత వారు హోటల్‌కు చేరుకున్నారు. సాయంత్రం షాలినీ గ్రౌండ్స్‌కు వెళ్లారు. పెళ్లి చేసుకుందామని ఫరీదాకు మరోసారి గిరీష్ ప్రతిపాదించాడు. అయితే ఆమె తిరస్కరించడంతో ఆగ్రహంతో రగిలిపోయాడు. కత్తితో పలుసార్లు ఆమెను పొడిచాడు. దీంతో ఫరీదా అక్కడికక్కడే మరణించింది.
కాగా, గిరీష్ ఆ తర్వాత జయనగర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఫరీదాను హత్య చేసిన విషయాన్ని చెప్పాడు. గతంలో కూడా తనను పెళ్లి చేసుకోవాలని ఫరీదాను గిరీష్ అడిగాడని, ఆమె నిరాకరిస్తుండటంతో వారి మధ్య తరచుగా గొడవలు జరుగుతున్నట్లుగా దర్యాప్తులో తెలిసిందని పోలీసులు తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

