చెన్నై : ఇన్‌స్టాలో ఉన్న ఈ వీడియో మీరు చూడాల్సిందే. ఇతనో నిర్మాణ రంగ(Chennai Worker) కార్మికుడు. అతని ఫిట్నెస్ చూశారా? అతనెలా ఆ షేప్ తెచ్చుకున్నాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. చెన్నైలో పనిచేసే ఈ కార్మికుడు తినేది చాలా సింపుల్ ఫుడ్. హై కార్బ్ డైయిట్నే అతను తింటున్నాడు. అతని మెనూలో ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఏదీ లేదు. చాలా ఆకట్టుకునేరీతిలో అతని బాడీ షేప్ తయారైంది. అయితే కాంటెంట్ క్రియేటర్ జయచంద్రన్ అతని వీడియో తీశాడు. అతని బాడీ బిల్డింగ్ రహస్యం ఏంటో తెలుసుకున్నాడు. వర్కౌట్ ఎలా ఉంటుందో కనుకొన్నాడు. ఈటింగ్ హ్యాబిట్స్ గురించి ఎంక్వైరీ చేశాడు.
రోజూ ఎండలో పనిచేసే ఈ కార్మికుడు అయిదు రోజుల వర్కౌట్ ప్లాన్‌లో ఉన్నాడు. పని భారం ఎంత ఉన్నా.. వారానికి కనీసం 5 రోజులు అతను వర్కౌట్ చేస్తాడు. సోమవారం చెస్ట్ వర్కౌట్, మంగళవారం షోల్డర్ వర్కౌట్, బుధవారం బ్యాక్ వర్కౌట్, గురువారం బైసెప్స్, ట్రైసెప్స్, ఇక శుక్రవారం లెగ్ వర్కౌట్ చేస్తానన్నాడు. అయితే కార్మికుడు కావడం వల్ల ఎక్కువగా లెగ్ వర్కౌట్‌ను సీరియస్‌గా చేయబోనన్నారు. ఎందుకంటే తెల్లవారితే మళ్లీ పనికి వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి ఆ ప్రెజర్ తీసుకోనన్నాడు.
రోజంతా పనిచేయాలంటే కార్బో డైట్ తప్పనిసరి. అందుకే అతను పెద్దగా ప్రోటీన్ డైయిట్పై ఆధారపడడం లేదు. రోజువారీ మెనూలో అన్నం, అరటిపండ్లు, గంజి ఉంటాయి. తన మెనూలో ఇడ్లీ, దోశ ఉండదన్నారు. తెల్ల అన్నంతో పాటు సాంబారు, రసం, కూరగాయలు ఎక్కువగా తీసుకుంటాడు. బీట్రూట్, క్యారెట్‌తో పాటు కూరగాయలతో చేసిన వంటలను ఎక్కువగా అతను ప్రిఫర్ చేస్తాడు. మూడు పూటలు అతను తెల్ల అన్నమే తింటాడట. చాలా అరుదుగా మాత్రమే పండ్లు తింటానన్నాడు. వారానికి ఓ సారి మాత్రమే మాంసాహారం తింటాడట. కేవలం మటన్ మాత్రం తింటాడు. చేపలు, కోళ్లు ముట్టుకోనన్నాడు. బాడీ షేప్ రావడానికి తానేమీ స్టిరాయడ్స్ వాడడం లేదన్నాడు. రోజుకు ఏడు గంటలు నిద్రపోతాడట. కేవలం ఇంట్లనే వండిన వంటనే సేవిస్తాడు. అతని లిస్టులో స్మోకింగ్ కానీ, డ్రింకింగ్ కానీ లేదు.