న్యూఢిల్లీ, డిసెంబర్ 3: చికెన్ అనగానే మాంసాహార ప్రియులకు నోరూరుతుంది. అయితే చికెన్‌తో వందలాది రకాలు చేయవచ్చు. అయితే వీటిలో కొన్నింటినే చాలామంది రుచి చూసి ఉంటారు. చాలా రకాలు ఎక్కువగా రెస్టారెంట్లలో మాత్రమే అందుబాటులో ఉంటాయి. అయితే చికెన్‌లలో బటర్ చికెన్ రుచే వేరంటూ ఆహార ప్రియులెవరైనా ఒప్పుకుంటారు.
ఇదే విషయాన్ని టేస్ట్ అట్లాస్ కూడా పేర్కొంటున్నది. ప్రపంచంలోని వంద రకాల చికెన్ వంటకాల్లో బటర్ చికెన్‌కే ఎక్కువ మంది ఓటేయడంతో ప్రథమ స్థానాన్ని దక్కించుకుందని సంప్రదాయ వంటకాలకు ఆన్లైన్ గైడ్‌గా ఉన్న టేస్ట్ అట్లాస్ తన లిస్టులో వెల్లడించింది.