న్యూఢిల్లీ: ఆర్ఆర్ఆర్(RRR) చిత్రంలోని నాటు నాటు సాంగ్‌కు ఆస్కార్(Oscar) అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇవాళ రాజ్యసభలో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు(MP Kesava Rao) మాట్లాడుతూ.. తన రాష్ట్రానికి చెందిన చిత్రానికి ఆస్కార్ అవార్డు దక్కడం సంతోషంగా ఉందన్నారు. బెస్ట్ ఒరిజినల్ సాంగ్(Best Original Song) కేటగిరీలో మన పాటకు అవార్డు వచ్చినట్లు ఆయన గుర్తు చేశారు. ఆ చిత్రానికి కథ రాసిన ఎంపీ విజయేంద్ర ప్రసాద్‌కు కూడా ఆయన కంగ్రాట్స్ చెప్పారు. డైరక్టర్ రాజమౌళి కూడా తమ రాష్ట్రానికి చెందినవారేనన్నారు. రెండు చిత్రాలకు ఆస్కార్లు రావడం ఇండియన్ సినిమాకు దక్కిన గుర్తింపు అని ఎంపీ కేశవరావు తెలిపారు.