Grand Welcome to KCR | సీఎం కేసీఆర్‌కు సర్కోలీలో ఘన స్వాగతం.. తులసిమాలతో సత్కరించిన భగీరథ్ బాల్కే
Grand Welcome to KCR | సోలాపూర్ జిల్లాకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు భగీరథ్ బాల్కే సీఎం కేసీఆర్‌కు ఘన స్వాగతం పలికారు.
సోలాపూర్: మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లాలో మంగళవారం బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగసభను నిర్వహించింది. సర్కోలీ గ్రామంలో జరిగిన ఈ సభకు బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సోలాపూర్ జిల్లాకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు భగీరథ్ బాల్కే సీఎం కేసీఆర్‌కు ఘన స్వాగతం పలికారు.
ముందుగా సోలాపూర్ సంప్రదాయ వస్త్రధారణలో భాగమైన తలపాగాను సీఎం కేసీఆర్‌కు తలకు అలంకరించారు. అనంతరం మెడలో కండువా కప్పారు. ఆ తర్వాత శాలువా కప్పి సత్కరించారు. తర్వాత తులసిమాల వేశారు. ఆపై సంగీత వాయిద్యమైన తంబురాను, చిడతలను బహూకరించారు. అదేవిధంగా శ్రీవిఠలేశ్వర స్వామి, రుక్మిణీ అమ్మవారు కలిసి ఉన్న ప్రతిమను అందజేశారు. అంతకుముందు సీఎం కేసీఆర్.. భగీరథ్ బాల్కేతోపాలు పలువురు నేతలకు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

సీఎం కేసీఆర్‌కు తలపాగా అలంకరిస్తున్న భగీరథ్ బాల్కే

సీఎం కేసీఆర్‌కు కండువా కప్పుతున్న భగీరథ్ బాల్కే

సీఎం కేసీఆర్‌కు తులసిమాల వేస్తూ భగీరథ్ బాల్కే

సీఎం కేసీఆర్‌కు శ్రీవిఠలేశ్వర, రుక్మిణీ అమ్మవారి ప్రతిమను బహూకరిస్తూ

సీఎం కేసీఆర్‌కు తంబురా బహూకరిస్తూ

Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
హైదరాబాద్‌ను గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్‌గా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్ దే : జగన్ మోహన్ రావు
Dada | బాలయ్య ‘దాదా’లో క్రేజీ ఐటెం సాంగ్.. థమన్ ఈసారి కూడా మాస్ బీట్తో దుమ్మురేపనున్నాడా?
Ramayana | రామ్ – రావణ్ వైభవాన్ని బిగ్ స్క్రీన్‌పై చూడాల్సిందే.. ‘రామాయణ’ సినిమాపై సందీప్ రెడ్డి వంగా ప్రశంసలు
Scene | సూర్య ‘సీన్’ ఓటీటీ రిలీజ్ టైం ఫిక్స్ .. నెట్‌ఫ్లిక్స్‌లో ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కానుందంటే!
Kamareddy | కామారెడ్డి జిల్లా జిల్లాలో విషాదం.. కుంటలో పడి తండ్రి, కూతురు మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

