వైరల్ వీడియో : చెల్లెలి క్షేమం కోసం ఆ బాలుడు ఏం చేశాడంటే..!
స్వచ్ఛమైన ప్రేమకు తోబుట్టువుల బంధం నిదర్శనంగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. ఈ వీడియో చూస్తే తోబుట్టువులంటే వీరిలా ఉండాలని ఎవరైనా అనుకుంటారు. ఈ వీడియోలో తన సైకిల్‌పై చెల్లెలిని భద్రంగా కూర్చునేలా అన్న చేసిన ప్రయత్నం నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంది.
న్యూఢిల్లీ : స్వచ్ఛమైన ప్రేమకు తోబుట్టువుల బంధం నిదర్శనంగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. ఈ వీడియో చూస్తే తోబుట్టువులంటే వీరిలా ఉండాలని ఎవరైనా అనుకుంటారు. ఈ వీడియోలో తన సైకిల్‌పై చెల్లెలిని భద్రంగా కూర్చునేలా అన్న చేసిన ప్రయత్నం నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంది. చెల్లెలి పట్ల ప్రేమ, ఆమె రక్షణకు అతడు తీసుకున్న జాగ్రత్తలు ఈ వీడియోలో కనిపిస్తాయి.
https://twitter.com/urdunovels/status/1609841111710711808?s=20&t=OWxuQqNEPO4ycAlVbykijw
ఉర్దూ నావెల్స్ అనే పేజ్ ఈ వైరల్ వీడియోను ట్విట్టర్లో షేర్ చేసింది. 22 సెకండ్ల వ్యవధి కలిగిన ఈ వీడియోలో ఓ బాలుడు తన చెల్లెలితో సైకిల్‌పై ప్రయాణించడం చూడవచ్చు. ఈ వీడియోలో బాలిక పడిపోకుండా సీటు వెనుక ఎత్తయిన మూటను అమర్చడంతో పాటు చిన్నారి కాళ్లు కదపకుండా ఉండేందుకు క్లాత్‌తో ఆమె కాళ్లను సైకిల్‌కు కట్టివేయడం కనిపిస్తుంది. చెల్లెలి క్షేమం కోసం అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాత బాలుడు తన సైకిల్ సవారీ స్టార్ట్ చేస్తాడు.
సో స్వీట్..బ్రదర్స్ లవ్ అని ఈ పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు. ట్విట్టర్లో షేర్ చేసినప్పటినుంచి ఈ వీడియోకు 14,000కుపైగా వ్యూస్ వచ్చాయి. అన్నా చెల్లెళ్ల బంధం సో..బ్యూటిఫుల్ అని పలువురు యూజర్లు ప్రశంసలు కురిపించారు. బాలుడు తన చెల్లెలి పట్ల ఎంత కేరింగ్‌గా ఉన్నాడని ఓ యూజర్ కామెంట్ చేయగా, సోదరుడి స్వచ్ఛమైన ప్రేమ ఇదంటూ మరో యూజర్ రాసుకొచ్చారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Bicycle
- Brother
- Sister
- Viral video
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

