కాంస్య యుగంలో ముద్దులు.. ఇప్పుడు దద్దుర్లు!
మీకు ఎప్పుడైనా పెదవుల దగ్గర లేదా శరీరంపై ఎక్కడైనా సన్నటి కురుపులు ఏర్పడి దురద పెట్టాయా? అలా కురుపులు ఏర్పడటానికి, అవి దురద పెట్టడానికి కారణం ఏమిటో తెలుసా? హెర్పస్ సింప్లెక్స్ వైరస్ వల్ల పెదవుల దగ్గర, శరీరంపై ఇటువంటి కురుపులు ఏర్పడుతాయని వైద్య పరిజ్ఞానం పేర్కొంటున్నది
న్యూఢిల్లీ, జూలై 28: మీకు ఎప్పుడైనా పెదవుల దగ్గర లేదా శరీరంపై ఎక్కడైనా సన్నటి కురుపులు ఏర్పడి దురద పెట్టాయా? అలా కురుపులు ఏర్పడటానికి, అవి దురద పెట్టడానికి కారణం ఏమిటో తెలుసా? హెర్పస్ సింప్లెక్స్ వైరస్ వల్ల పెదవుల దగ్గర, శరీరంపై ఇటువంటి కురుపులు ఏర్పడుతాయని వైద్య పరిజ్ఞానం పేర్కొంటున్నది. కానీ అసలు నిజం వేరే ఉంది. కాంస్య యుగం నాటి పూర్వీకులు శృంగార సమయంలో ముద్దులు పెట్టుకోవడం వల్లనే ఇప్పుడు మీకు ఆ కురుపులు ఏర్పడి దురద పెడుతుంటాయట.
ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 370 కోట్ల మంది ఈ వైరస్ బాధితులేనని ‘సైన్స్ అడ్వాన్సెస్’ అనే పత్రికలో ప్రచురితమైన ఓ పరిశోధన నివేదిక వెల్లడించింది. వెయ్యేండ్ల క్రితం నాటి మానవ దంతాలను పరీక్షించినప్పుడు ఈ వైరస్‌కు సంబంధించిన డీఎన్ఏ కనిపించినట్టు పరిశోధకులు పేర్కొన్నారు. నవీన శిలాయుగంలో వలసల కారణంగా ఈ వైరస్ యురేషియా నుంచి ఐరోపాకు వచ్చినట్టు తెలిపారు. రోమన్ సామ్రాజ్యంలో ఈ వైరస్ విస్తృతంగా వ్యాపించినప్పుడు చక్రవర్తి టైబీరియస్.. బహిరంగ ప్రదేశాల్లో, అధికార సమావేశాల్లో ముద్దులు పెట్టుకోవడంపై నిషేధం విధించినట్టు చరిత్ర చెప్తున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- allergies
- ancestors
- Bronze age
- lip
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

