తండ్రి వల్ల తీవ్ర మనోవేదనకు గురవుతున్నా: బ్రిట్నీ స్పియర్స్

న్యూయార్క్: అమెరికా పాప్ స్టార్ బ్రిట్నీ స్పియర్స్ తీవ్ర మనోవేదకు గురవుతున్నట్లు చెప్పింది. లాస్ఏంజిల్స్ కోర్టుకు వినిపించిన ఫోన్ సందేశంలో ఆమె తన బాధలను చెప్పుకున్నది. గత 13 ఏళ్ల నుంచి తన తండ్రి వల్ల మానసిక క్షోభను అనుభవిస్తున్నట్లు ఆమె పేర్కొన్నది. సంరక్షణ స్థానం నుంచి తన తండ్రిని తప్పించాలని, ఆయన వద్ద ఉన్న నియంత్రణాధికారాలను తొలగించాలని బ్రిట్నీ కోర్టును వేడుకున్నది. 2008 నుంచి పాప్ సింగర్ బ్రిట్నీ తన తండ్రి జేమ్స్ స్పియర్స్ కస్టడీలో ఉంటున్నది. అయితే తనపై తన తండ్రికి ఉన్న న్యాయపరమైన నియంత్రణను తొలగించాలని ఆమె కోర్టును అభ్యర్థించింది.
నా జీవితాన్ని నాకివ్వండి
బ్రిట్నీ ఆర్థిక వ్యవహారాలన్నీ తండ్రి జేమ్స్ చూసుకుంటున్నారు. తాను షాక్లో ఉన్నానని, తీవ్ర వేదనకు గురైనట్లు ఆమె తన ఫోన్ సందేశంలో పేర్కొన్నది. 13 ఏళ్ల నరకం ఇక చాలు అని, తన జీవితాన్ని తనకు వెనక్కి ఇప్పించాలని ఆమె కోర్టును కోరింది. బ్రిట్నీ స్పియర్స్ తన తండ్రి వల్ల ఇబ్బందులు పడుతున్నదని, ఆమెను తండ్రి చెర నుంచి విముక్తి చేయాలని చాన్నాళ్ల నుంచి ఆన్లైన్లో ఫ్రీ బ్రిట్నీ ఉద్యమం కొనసాగుతున్న విషయం తెలిసిందే. సంరక్షణాధికారాలను తన తండ్రి దుర్వినియోగం చేసినట్లు బ్రిట్నీ ఆరోపించారు. పాప్ సింగర్ బ్రిట్నీ వయసు 39 ఏళ్లు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

